Asianet News Telugu

Telangana Elections 2023: పోటీ చేయనన్న బాబు మోహన్.. ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ. . అసలేం జరిగింది ?
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఆసక్తి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బిఆర్ఎస్.. అన్ని పార్టీల కంటే ముందుగానే తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అసంతృప్తి, ఆశవాహ నేతలను బుజ్జగించి.. ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది.ఇక బిజెపి, కాంగ్రెస్ లు మాత్రం నింపాదిగా అభ్యర్థన ప్రకటిస్తూ..ప్రచారం సాగిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ 53మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. తాజాగా మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి 35 మందికి సీట్లు కేటాయించింది. అయితే ఈ జాబితాలో నటుడు, మాజీ ఎమ్మెల్యే  బాబు మోహన్ పేరు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఎందుకంటే.. ఈ సారి తనకు సీటు ఇచ్చిన ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. ఒకవేళ లిస్టులో తన పేరు వచ్చిన తాను పోటీకి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే.. దీనికి కారణం కూడా లేకపోతే.. తాను పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు  గతంలో బాబు మోహన్ తెలిపారు. తనకు ఫస్ట్ లిస్ట్ లోనే టిక్కెట్ వస్తుందని ఆశించారు. కానీ, నిరాశే ఎదురైంది. దీంతో తాను తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు, పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదంటూ వాపోయారు. ఫైనల్ గా పార్టీ అధిష్టానం వ్యవహరించే తీరును బట్టి పార్టీలో ఉండాలా? లేదా? అనేది నిర్ణయించుకున్నారని వెల్లడించారు.

గ‌త ఎన్నిక‌ల్లో బాబుమోహ‌న్ ఓడిపోవడం.. అతడు మూడో స్థానానికి పరిమితం కావడంతో ఈ సారి బాబు మోహన్ కు  టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అదే సమయంలో బాబు మోహ‌న్ కుమారుడికి టికెట్ ఇస్తార‌నే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ప్ర‌చారంపై బాబుమోహ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న‌కు అన్యాయం జరిగితే.. పార్టీని వీడుతానని, పోటీ నుంచి త‌ప్పుకుంటానని ప్ర‌క‌టించారు. అలాగే బీజేపీ నేతలు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు.

కానీ, తాజాగా విడుదలైన జాబితాలో అనూహ్యంగా ఆందోల్ స్థానం నుంచి బాబు మోహన్ బరిలో ఉన్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించడం అందర్ని ఆశ్యర్యపరిచింది. మరోవైపు అధిష్టానాన్ని బెదిరించి టికెట్ సాధించుకున్నారనే చర్చ పార్టీ నేతల్లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3 వ తేదీ నుంచి నవంబర్ 10 మధ్య నామినేషన్ల ప్రక్రియ సాగునున్నది. నవంబర్ 30న పోలింగ్ జరగగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ , అదే రోజు ఫలితాల వెల్లడి కానున్నాయి.

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
అమలాపురం : ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందజేశారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు మానవతా దృక్పథంతో స్పందించి..  ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 41.50 లక్షలు మంజూరు చేశారు.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లేస్సీ కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంది. రోజురోజుకు తలనొప్పి ఎక్కువ అవుతుండడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేయించిన వైద్యులు బ్రెయిన్ క్యాన్సర్ గా నిర్ధారించారు. చిన్నారికి చికిత్స చేయడం కోసం రూ.41.50  లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.

కొండపల్లిలో గుండెలు పిండేసే ఘటన... పసికందును సంచిలో కుక్కి తరలిస్తూ పట్టుబడ్డ వృద్దుడు (వీడియో)

అంత డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేని కుటుంబం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సీఎం జగన్ ఈనెల 11వ తేదీన  అమలాపురంలో పర్యటించారు. ఆ సమయంలో  ఆ చిన్నారి తండ్రి రాంబాబు తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా  తీసుకువెళ్లారు.

వైఎస్ జగన్ ఆ చిన్నారి సమస్య విని చలించిపోయారు. వెంటనే స్పందించి రూ. 41.50 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ భార్య బేబీ మీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ లు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సోమవారం బాధిత కుటుంబానికి అందించారు.

కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల: కాలినడకన తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక చేతికర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ  చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు  టీటీటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి  తిరుమలలో  మీడియాతో మాట్లాడారు.  తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు  భద్రతను కల్పించే విషయమై  హైలెవల్ కమిటీ చర్చించింది.ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను  ఆయన మీడియాకు వివరించారు.

తిరుమలకు వచ్చే భక్తుల భద్రత అంశంపై  హైలెవల్ కమిటీలో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.తిరుమలకు  వచ్చే భక్తులపై  చిరుతల దాడుల గురించి చర్చించినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి  చెప్పారు. అలిపిరి నడక మార్గంలో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే  పిల్లలకు అనుమతిని ఇస్తామని  ఆయన  చెప్పారు. భక్తుల భద్రతకు  నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీని నియమిస్తామన్నారు.భక్తుల భద్రత కోసం  వినియోగించుకొనే  ఫారెస్ట్ సిబ్బంది ఖర్చును టీటీడీ భరిస్తుందని   భూమన కరుణాకర్ రెడ్డి  వివరించారు.

నడక మార్గంలో  సాధు జంతువులకు  ఆహారం ఇవ్వకూడదని టీటీడీ చైర్మెన్ భక్తులను  కోరారు. ఒకవేళ అలా  ఆహారం ఇచ్చిన భక్తులపై  చర్యలు తీసుకుంటామని  భూమన కరుణాకర్ రెడ్డి  చెప్పారు. వ్యర్థ పదార్ధాలను  బయటే వదిలేసే  దుకాణాలపై  చర్యలు తీసుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. భక్తులు గుంపులు గుంపులుగా  నడక మార్గంలో వెళ్లాలని ఆయన  సూచించారు.  అలిపిరి, ఏడో మైలు రాయి, గాలి గోపురం వద్ద క్రూర మృగాల గురించి సూచిక బోర్డులను  ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే విధంగా  వీడియోలను  కూడ ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన  వివరించారు.నడక మార్గంలో  ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటుకు  అటవీశాఖ నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. ఈ విషయమై  అటవీశాఖ వద్ద ప్రతిపాదన పెట్టినట్టుగా టీటీడీ చైర్మెన్ చెప్పారు. అయితే అధ్యయనం చేసి చెబుతామని అటవీశాఖాధికారులు చెప్పారని ఆయన  తెలిపారు.

తాడిపత్రిలో విషాదం: నవదంపతుల ఆత్మహత్య
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో  నవ దంపతులు  ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తాడిపత్రిలో విషాదాన్ని నింపింది. ఐదు నెలల క్రితం రమాదేవి, మంజునాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే  వీరిద్దరి మధ్య  ఏం జరిగిందో ఏమో కానీ  రమాదేవి ఈ నెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.  దీంతో  మనోవేదనకు గురైన  మంజునాథ్ ఇవాళ   ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపుతుంది.

దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో  ఆత్మహత్య ఘటనలు ప్రతి రోజూ అనేకం చోటు  చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు  చేసుకుంటున్న  ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి.  సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని  మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

అసోం  రాష్ట్రంలో  అక్కా చెల్లెళ్లపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మనోవేదనకు గురైన బాధితులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన ఈ నెల 7వ తేదీన  చోటు  చేసుకుంది.

షేర్ మార్కెట్ లో నష్టపోవడంతో  బెంగుళూరులో నివాసం ఉంటున్న ఏపీ రాష్ట్రానికి చెందిన మచిలీపట్టణానికి  చెందిన వీరాంజనేయ విజయ్  భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.ఈ నెల 6న  ఈ  ఘటన చోటు చేసుకుంది.ఈ నెల 5వ తేదీన  తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అదే రోజున న్యూఢిల్లీలోని  నోయిడాలో భార్యాభర్తలు  ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Blackmail: ప్రాణం తీసిన మిస్డ్ కాల్.. వివాహిత ఆత్మహత్య.. ఎందుకంటే?
హైదరాబాద్: ఓ మిస్డ్ కాల్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్‌కు చెందిన వివాహిత ఇంటిలో సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇటు భర్త కుటుంబం, అటు తల్లిదండ్రుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన వరంగల్‌లోని కరీమాబాద్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఆకుతోట సౌజన్య ఓ ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్నది. ఆమెకు ఓ కొన్ని నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ మిస్డ్ కాల్ ఎవరా? అని ఆమె రివర్స్ కాల్ చేసింది. అటు వైపున తిరుపతి అనే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ ఫోన్‌లో సంభాషణలు వారిని మరింత చనువుగా చేశాయి.

తిరుపతి తియ్యగా మాట్లాడుతూనే.. మనసులో కపటంతో ఉన్నాడు. ఆ మహిళను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఆయన ప్లాన్‌లో భాగంగానే.. సౌజన్యతో ఫోన్‌లో క్లోజ్ అయ్యాక వీడియో కాల్ చేయడం ప్రారంభించాడు. వీడియో కాల్ చేసిన తర్వాత ఓ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సౌజన్య ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించాడు. ఆమె ఫోన్ కాంటాక్టులను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఆమెపై వేధింపులు ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. లేదంటే.. ఆమెతో చనువుగా మాట్లాడిన వీడియోలను రికార్డ్ చేశానని, వాటిని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు.

Also Read: పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?

ఈ విషయం చివరకు ఆమె భర్తకు తెలిసింది. దీంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇంటి వద్ద నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి సౌజన్య మరణించింది.

ఈ ఘటన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. అనంతరం, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కరీంనగర్‌: రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి
BJP leader dies in road accident: కరీంనగర్ లో చోటుచేసుకున్న‌ ఘోర రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయ‌కుడు ఒక‌రు మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, బీజేపీ నేత కొమురరెడ్డి ప్రాణాలు కోల్పోయార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

వివ‌రాల్లోకెళ్తే.. హుజూరాబాద్ మండలం కనుకులగిద్దే సర్పంచ్ గోపు కొమురరెడ్డి శనివారం తెల్లవారుజామున శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో వాహనాన్ని నడుపుతున్న కొమురరెడ్డి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడైన కొమురారెడ్డి గతంలో హుజూరాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, ఇతర పదవుల్లో పనిచేశారు. ఈటల రాజేందర్ అధికార పార్టీ విభేధాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం బీజేపీలో చేరారు. ఈట‌ల‌తో క‌లిసి కొమురారెడ్డి కూడా బీజేపీలో చేరారు.

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, మ‌నోవేద‌న‌తో తండ్రి..

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించిన కొన్ని గంటలకే మనోవేదనతో తండ్రి తన జీవితాన్ని ముగించాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన వాంకిడి మండలం సామెల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వాంకిడి మండలం జైత్‌పూర్‌ క్రాస్‌రోడ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరాం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తులసీరామ్ తండ్రి భీమ్‌రావ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొడుకు మరణించిన కొన్ని గంటలకే సామెల గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఖమ్మంలో..

దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయి నలుగురు మృతిచెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ‌-ఏపీ సరిహద్దులో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి కిందపడిపోయింది. దీంతో అప్పటివరకు ఆనందోత్సాహాలతో సాగిన ప్రయాణం ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయింది.

భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం
భారత్ లో మళ్లీ కోవిడ్ -19 విజృంభిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు నెలల్లో ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11 వేలు దాటాయి.

ఉచితంగానే యూపీఐ పేమెంట్స్.. ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు.. : ఎన్పీసీఐ

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903 కు పెరిగాయి. చివరి సారిగా గతేడాది అక్టోబర్ 28వ తేదీన దేశంలో 2,208 కేసులు వెలుగులోకి వచ్చాయి.

India records 2,151 new COVID-19 cases, 1,222 recoveries in the last 24 hours; Active caseload stands at 11,903
— ANI (@ANI) March 29, 2023

నేటి ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన డేటా ప్రకారం.. కరోనా వల్ల మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో ముగ్గురు మరణించారు. దీంతో కోవిడ్-19 మరణాల సంఖ్య 5,30,848కి చేరింది. రోజువారీ పాజిటివిటీ 1.51 శాతంగా, వీక్లీ పాజిటివిటీ 1.53 శాతంగా నమోదైంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లలో ప్రస్తుత యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతంగా ఉన్నాయి.

పార్లమెంట్‌లో కీలక పదవికి ఎన్నికైన విజయసాయిరెడ్డికి.. కాంగ్రెస్, బీజేపీ సహా ఐదు పార్టీల మద్ధతు

జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,66,925కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా.. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్స్ అందించారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్వితే ఇక ఐదేళ్ల జైలు శిక్ష.. హెచ్చరికలు జారీ చేసిన రైల్వే శాఖ

రెండు వారాల్లో 3.5 రేట్లు పెరిగిన కరోనా కేసులు..
భారతదేశంలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లోనే కరోనా కేసులు 3.5 రేట్లు పెరిగాయి. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వీక్లీ టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్) 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాల సంఖ్య 32 కు పెరిగింది. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాల్లో మార్చి 19-25 తేదీల్లో టీపీఆర్ 5-10 శాతంగా ఉంది. కాగా.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, దానిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్ర‌స్తుత ప‌రిస్థితులను అంచనా వేసేందుకు ఇటీవల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.

కోవిడ్ -19 ముగిసిందా? ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ పై డబ్ల్యుహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ ఏం అన్నారంటే ?
కోవిడ్-19 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ తో కొన్ని దేశాల్లో మరొక వేవ్ ఇన్ఫెక్షన్లను చూసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గురువారం చెప్పారు. ‘‘ ఒమిక్రాన్ కు 300కు పైగా సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆందోళన చెందుతున్నది ఎక్స్ బిబి అని నేను అనుకుంటున్నాను. ఇది రీకాంబినెంట్ వైరస్. మేము ఇంతకు ముందు కొన్ని రీకాంబినెంట్ వైరస్లను చూశాం. అయితే ఇది అధిక రోగనిరోధక-తప్పించుకుంటుంది.  అంటే ఇది ప్రతిరోధకాలను అధిగమించగలదు. ఎక్స్ బీబీ కారణంగా కొన్ని దేశాల్లో మరో వేవ్ ఇన్ఫెక్షన్లను మనం చూడచ్చు ’’ అని స్వామినాథన్ అన్నారు.

‘భారతంలో శ్రీ కృష్ణుడు జిహాద్‌ పాఠాలు బోధించాడు’- కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

కోవిడ్ కొత్త వేరియంట్లు ప్రస్తుత వేరియంట్ల కంటే తీవ్రంగా ఉన్నాయని సూచించడానికి ఏ దేశం నుండి డేటా లేదని స్వామినాథన్ అన్నారు.  అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వైరస్  బీఏ.5,  బీఏ.1 వేరియంట్లను ట్రాక్ చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఒమిక్రాన్ ఎక్స్ బీబీ సబ్ వేరియెంట్ పై తాజా నివేదికలు కోవిడ్-19లో తాజా పరిణామాలు, కోవిడ్ అనంతర ప్రపంచంలో సవాళ్లకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తాయని చెప్పారు.

నకలు చిట్టీని లవ్ లెటర్‌గా పొరబడిన బాలిక.. అబ్బాయిని చంపేసిన ఆమె సోదరులు

కోవిడ్ వైరస్ ను పర్యవేక్షించి ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని స్వామి నాథన్ నొక్కి చెప్పారు. ‘‘ మనం కోవిడ్ వైరస్ ను పర్యవేక్షించడం, ట్రాక్ చేయడం కొనసాగించాలి. అనేక దేశాలలో పరీక్షలు తగ్గుముఖం పట్టాయని, గత కొన్ని నెలలుగా జన్యుపరమైన నిఘా కూడా తగ్గిందని మాకు సమాచారం ఉంది. జన్యు నిఘా కనీసం వ్యూహాత్మక నమూనాను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది. ’’ అని ఆమె అన్నారని వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది.  కోవిడ్-19 అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొనసాగుతోందని స్వామినాథన్ చెప్పారు.

యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
ఇదిలా ఉండగా.. ఇప్ప‌టికే అమెరికాతో పాటు  ప‌లు దేశాల్లో గుర్తించిన అతి ప్రమాద‌క‌రైనదిగా పేర్కొన్న క‌రోనా స‌బ్ వేరియంట్ బీక్యూ.1, బిక్యూ.1.1 వేరియంట్లను భార‌త్ లో కూగా గుర్తించారు. అయితే ఇప్పటివ‌ర‌కు దేశంలో చాలా వేరియంట్లు వెలుగులోకి వ‌చ్చినా పెద్ద‌గా ప్ర‌మాదం చూపలేదు. కానీ ఇప్పుడు గుర్తించిన ఈ వేరియంట్లు అతి ప్ర‌మాద‌ర‌మైన‌వి... ఎందుకంటే, అమెరికాలోని యాక్టివ్ కేసుల్లో 10 శాతానికి పైగా ఈ వేరియంట్ల‌కు చెందిన‌వి కావ‌డం ఆందోళ‌న కలిగిస్తోంది. మ‌హారాష్ట్రలో ఈ కొత్త వేరియంట్ల‌ను గుర్తించారు. క‌రోనా సోకిన  పూణే నివాసి న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ సమయంలో భారతదేశంలో మొట్టమొదటి ఓమిక్రాన్ కోవిడ్-19 సబ్‌వేరియంట్ BQ.1 కేసు కనుగొనబడిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గత సోమవారం పేర్కొంది.

మునుగోడు ఉపఎన్నికలు : కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త దగ్గర కోటి రూపాయలు సీజ్..
హైదరాబాద్ : ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో సోమవారం ఉదయం వాహనాల తనిఖీలో కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త నుంచి కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఎస్.వేణు(48) మాట్లాడుతూ.. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి నగదు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా చెలిమెడ ఎక్స్ రోడ్స్ వద్ద కారును అడ్డుకున్నారు. వివేక్ చెప్పడంతో విజయవాడకు చెందిన రాము వద్ద నగదు సేకరించి తీసుకువస్తున్నట్లు వేణు మాకు తెలిపారని పోలీసులు అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను నోడల్ అధికారికి అందజేస్తామని నల్గొండ పోలీసులు తెలిపారు. ఈ నగదును ఎవరికి అందించాలనుకున్నారో తేలాల్సి ఉంది.

నల్గొండ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నియోజక వర్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, అక్రమ నగదులను అడ్డుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నాడు రూ.19లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సోమవారం   చల్మెడ వద్ద  కోటి రూపాయాల నగదును పోలీసులు స్వాధీనం  చేసుకున్న సంగతి తెలిసిందే. చెక్ పోస్టుల దగ్గర కాకుండా రోడ్లపై వెడుతున్న వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ నగదును పోలీసులు గుర్తించారు. మంగళవారం గట్టుప్పల్ సమీపంలోని ఓ కారులో  రూ.19 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.

ఆ సమయంలో ఈ కారులో ఓ పార్టీకి చెందిన జెండాలను గుర్తించారు పోలీసులు. అయితే ఈ నగదు  ఎక్కడిదనే విషయమై పోలీసులు  ఆరా  తీస్తున్నారు. కారులో నగదుతో పాటు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ట్రెజరీ  కార్యాలయానికి తరలిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వస్తారా?.. టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ.. ఆ ఆలోచనలో గులాబీ బాస్..!

ఇదిలా ఉంటే, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే సోదాల్లో పోలీసులు రూ.13 లక్షలను సీజ్ చేశారు. ఆ తర్వాత మునుగోడు  మండలం రత్తుపల్లి దగ్గర రూ.6.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. .ఈ నెల 7న గూడపూర్ దగ్గర  రూ.79 లక్షలను సీజ్ చేశారు. వచ్చే నెల 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ  స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు నాలగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇక ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

వామ్మో.. కోవిడ్ కొత్త వేరియంట్.. పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న BA.4.6 కేసులు
మళ్లీ కోవిడ్ కొత్త వేరియంట్ వస్తోంది. BA.4.6 గా పరిగణిస్తున్న ఈ సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూకే, యూఎస్ఏ వంటి దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. UK హెల్త్  సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నుంచి కోవిడ్ వేరియంట్లపై తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ కొత్త వేరియంట్ ఆగస్ట్ 14వ తేదీ సమయంలో UKలో 3.3 శాతం నమూనాలను కలిగి ఉండ‌గా.. ఇప్పుడ‌ది 9 శాతానికి పెరిగింది.

త‌ప్పుడు ప్ర‌చారాల‌తో శాంతిభ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌వు.. యూపీ మైన‌ర్ సిస్ట‌ర్స్ ఘ‌ట‌న‌పై ప్రియాంక గాంధీ..

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్ ప్ర‌కారం.. BA.4.6 ఇప్పుడు US అంతటా ఇటీవలి కేసులలో 9 శాతానికి పైగా ఉంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఈ వేరియంట్ గుర్తించారు. కాగా.. BA.4.6 అనేది ఓమిక్రాన్ కు చెందిన BA.4 రూపాంతర సంతతి. BA.4 మొదటి సారిగా జనవరి 2022లో దక్షిణాఫ్రికాలో క‌నుగొన్నారు. అప్పటి నుంచి BA.5 వేరియంట్ తో పాటు ప్రపంచమంతటా వ్యాపించింది.

BA.4.6 ఎలా ఉద్భవించిందో పూర్తిగా స్పష్టంగా తెలియలేదు, కానీ అది రీకాంబినెంట్ వేరియంట్ కావచ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. SARS-CoV-2 (COVID-19కి కారణమయ్యే (వైరస్) రెండు వేర్వేరు రకాలు ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సోకినప్పుడు ఇలా పునఃసంయోగం జరుగుతుంది. BA.4.6 అనేక విధాలుగా BA.4ని పోలి ఉంటుంది, ఇది వైరస్ ఉప‌రిత‌లంపై ఉన్న ప్రోటీన్ అయిన స్పైక్ ప్రోటీన్  కు మ్యూటేష‌న్ ను క‌లిగి ఉంటుంది. ఈ ప్రోటీన్ మనిషి క‌ణాల‌లోకి ప్రవేశించడానికి సుల‌భ‌త‌రం చేస్తుంది.

ల‌ఖింపూర్ లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ ఇద్ద‌రు ద‌ళిత అక్కాచెళ్లెల్ల మృతదేహాలు

పాత వేరియంట్ల తో పోలిస్తే ఓమిక్రాన్ ఇన్ ఫెక్ష‌న్ లు కొంచెం త‌క్కువ తీవ్ర‌త‌ను క‌లిగి ఉంటుంది. దీని ప్ర‌భావం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. దీని వ‌ల్ల మ‌ర‌ణాలు కూడా త‌క్కువ సంఖ్య‌లోనే ఉన్నాయి. BA.4.6 కూడా ఇలాగే ఉంటుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఈ మ్యూటేష‌న్ వ‌ల్ల తీవ్ర ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు నివేదిక‌లు లేవు.

కానీ ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు మునుపటి వేరియంట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ మిసిబుల్ గా ఉంటాయని కూడా తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకోవడంలో BA.5 కంటే BA.4.6 కొంచెం మెరుగ్గా క‌నిపిస్తోంది. ఇదే ప్రస్తుతం ఆధిపత్య వేరియంట్. ఈ సమాచారం ప్రిప్రింట్ (ఇంకా పీర్-రివ్యూ చేయని అధ్యయనం)పై ఆధారపడి ఉన్నప్పటికీ.. ఇతర అభివృద్ధి చెందుతున్న డేటా దీనికి రుజువు చేస్తోంది.

విమాన సిబ్బందికి డీజీసీఎ కీల‌క ఉత్త‌ర్వులు .. విధుల్లో చేరాలంటే.. ఆ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి..

UKHSA నివేదిక‌ల ప్ర‌కారం.. ఇంగ్లాండ్ లో BA.5 కంటే BA.4.6 6.55 వేగంగా వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని ముంద‌స్తు అంచ‌నాలు సూచిస్తున్నాయి. BA.4.6 సంక్రమణ ప్రారంభ దశలలో మరింత త్వరగా పునరావృతమవుతుంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఈ వేరింయ‌ట్ ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

హోం వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ బాలిక మృతి...
నిజామాబాద్ : టీచర్ల కర్కశత్వానికి విద్యార్థులు బలవుతున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీచర్ ఇచ్చిన పనిష్మెంటుకు కాళ్లు కోల్పోయిన ఓ విద్యార్థి ఘటన మరువకముందే నిజామాబాద్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ కొట్టిన దెబ్బలకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే...

పాఠశాలలో ఇచ్చిన హోంవర్క్ చేయకపోవడం అభం శుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది. తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఉపాధ్యాయురాలు.. రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. టీచర్ విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది.  చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. నిజామాబాద్లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్, అర్సపల్లిలోని ఫుట్ బ్రిడ్జ్ పాఠశాలలో మంతాష (7)  అలియాస్ ఫాతిమా రెండో తరగతి చదువుతోంది.

ఫాతిమా హోం-వర్కు చేయకపోవడంతో గత శుక్రవారం ఓ టీచర్ విపరీతంగా కొట్టింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమా సోమవారం రాత్రి కన్ను మూసింది. ఫాతిమా అంత్యక్రియలను మంగళవారం నిజామాబాదులో పూర్తి చేశారు.

సరిగా లైన్లో నిలబడలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్, ప్రిన్సిపల్.. ఇద్దరి అరెస్ట్..

అయితే, ఫాతిమా మరణం గురించి తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు పాఠశాలవద్దకు చేరి ఆందోళనకు దిగారు.  టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఫాతిమామరణంతో తమకు సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం చెబుతోందని వారు ఆరోపించారు. ఫాతిమా మరణంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు చేసిన ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, చిన్నారి మృతి ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఫుడ్ బ్రిడ్జి పాఠశాలను సీజ్ చేయాలని డీఈఓ ఎన్వీ దుర్గాప్రసాద్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, తెలంగాణలో ఇలా ఓ టీచర్ అత్యుత్సాహం, మూర్ఖత్వంతో ఓ విద్యార్థి కాళ్లు కోల్పోయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లి.. హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. విద్యార్థినిపై హౌస్ టీచర్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది. పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పేరుతో ఐదు రోజుల పాటు ఆ విద్యార్థిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసింది. ఐదు రోజులు.. రోజూ ఎనిమిది గంట‌ల‌ పాటు.. హాస్టల్‌ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చ‌చ్చుబ‌డ్డాయి. ఆచేత‌నంగా మారిపోయాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న‌..ఆ విద్యార్థిని చికిత్స కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం రేగడ్డ మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక అనే అమ్మాయి వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే అస్వస్థతగా ఉండడంతో ఈ నెల 18వ తేదీన ఒకరోజు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆస్ప‌త్రిలో చూపించుకుని, రీక‌వ‌రి అయింది. ఆ త‌రువాత రెండు రోజులు ఆలస్యంగా 22వ తేదీన కాలేజీకి వ‌చ్చింది. దీంతో  మూడు రోజులు అధికంగా సెలవు తీసుకుందని హౌస్ టీచర్ కోపానికి వచ్చింది. విద్యార్థినిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

వచ్చిన రోజునుంచి ఐదురోజుల పాటు రోజూ దాదాపు ఎనిమిది గంట‌ల పాటు హాస్టల్‌ బయటే నిలబెట్టింది. కాలేజీకి కూడా వెళ్లనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని నిలబడి ఉండటంతో ఆమె కాళ్లు మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియడం లేదు. నడవలేనిస్థితిలో ఉన్న నిహారికను హాస్టల్‌ లోని ఆరోగ్య సిబ్బంది వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విష‌యం తెలుసుకున్న నిహారిక త‌ల్లిదండ్రులు అధ్యాపకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మాభిమానం ఎక్కువ, ఆ ఇద్దరిని తొలగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్: చెరుకు సుధాకర్ , అద్దంకి దయాకర్లను పార్టీ నుండి తొలగించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తనను దుర్భాషలాడిని చెరుకు సుదాకర్ ను పార్టీలోకి ఎలా తీసుకొంటారని  ఆయన  ప్రశ్నించారు. తనను బూతులు తట్టిన అద్దంకి దయాకర్ పార్టీలోనే ఇంకా ఉన్నారన్నారు. వీరిద్దరిని పార్టీ నుండి తొలగిస్తే అప్పుడు తాను మాట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.తనను పార్టీ నేతలు ఎవరూ కూడా కలవాల్సిన అవసరం లేదన్నారు.  పార్టీలోనే ఉంటా ఇక్కడే తేల్చుకొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

also read:కోమటిరెడ్డితో చర్చించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించాలి: కాంగ్రెస్ నేతలకు ప్రియాంక ఆదేశం

సోమవారం నాడు న్యూఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆయనతో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.ఈ కారణంగానే తాను సమావేశానికి రావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో ప్రియాంక గాంధీ సోమవారం నాడు చర్చలు జరిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించిన తర్వాతే మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని నిర్ణయించాలని ప్రియాంకగాంధీ సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పార్టీ రాష్ట్ర నేతలు చర్చించాలని కూడా సూచించారు.  ప్రియాంక గాంధీ సూచనలతో త్వరలోనే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన  పార్టీ సమావేశానికి హాజరు కాకుండా హైద్రాబాద్ కు చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి నుండి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ పదవి నుండి మాణికం ఠాగూర్ ను తప్పించాలని కోరారు.

తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తనకు తెలియకుండానే చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నించారని కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలోనే ఆరోపించారు. మరో వైపు ఈ నెల 5న చండూరులో జరిగిన సభలో తనను అద్దంకి దయాకర్ దూషించడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు కాంగ్రెస్ సీనియర్లు వేదికపై ఉన్న సమయంలోనే అద్దంకి దయాకర్ తనపై వ్యాఖ్యలు చేసినా కూడా పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. సోనియాకు రాసిన లేఖలో ఈ అంశాలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తన అనుచరులతో తనను అవమానిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ఆశించిన ఫలితాలు దక్కలేదు:కేసీఆర్
హైదరాబాద్:ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దేశం అనుకున్నంత పురోగమించడం లేదన్నారు. భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం కేసీఆర్.

ఎందరో చేసిన త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన  విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. గాంధీజీ గురించి ఈ తరం పిల్లలకు తెలియదన్నారు. కానీ కొందరు గాంధీజీని చులకన చేసి మాట్లాడడాన్నికేసీఆర్ తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితితో పాటు  ప్రపంచ దేశాలు మహత్మాగాంధీని పోగడ్తలతో ముంచెత్తే విషఁయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందని కేసీఆర్ గుర్తు చేశారు. సుమారు కోటి మందికిపైగా ఏక కాలంలోనే జాతీయ గీతాలాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కూాడ పేదల ఆశలు ఇంకా నెరవేరలేదన్నారు. బడుగు వర్గాల ప్రజల్లో  ఆక్రోశం ఇంకా ఉందని కేసీఆర్ చెప్పారు. అనేక వర్గాల ప్రజల్లో స్వాతంత్ర్య ఫలాలు అందలేదనే ఆవేదన ఉన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. వీటన్నింటిని విస్మరించి ఒక్క ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  ఈ కుత్సిత ప్రయత్నాలు తెలిసి కూడా చూస్తూ ఉండడం సరైంది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ధీరోధాత్తులు, మేథావులు, వైతాళికులు కరదీపికలుగా మారి సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం పురోభివృద్ది సాధిస్తుందని  సీఎం చెప్పారు. మన దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ది సాధించలేదన్నారు. కులం, జాతి, పేద, ధనిక అనే బేధం లేకుండా అందరిని కలుపుకొని  ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేసీఆర్  ఈ సందర్భంగా ప్రస్తావించారు.అనంతరం రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను సీఎం కేసీఆర్ సన్మానించారు. తొలుత ఎల్బీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలు ముగింపును పురస్కరించుకొని  ఎల్బీ స్టేడియంలో ి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

corona virus : క‌రోనా క‌ల‌క‌లం.. భార‌త్ లో కొత్త‌గా 16 వేల కేసులు.. 68 మ‌ర‌ణాలు
భార‌త్ క‌రోనాలో క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త కొంత కాలం నుంచి త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు.. ఇటీవ‌ల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో దాదాపు 16 వేల కొత్త కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే క‌రోనా వ‌ల్ల 68 మ‌రణాలు సంభ‌వించాయి. ఈ వివ‌రాల‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ శ‌నివారం అధికారికంగా వెల్ల‌డించింది.

Salman Rushdie: అందుకే సల్మాన్ రష్దీ పుస్తకాన్ని బ్యాన్ చేశాం.. రష్దీ అద్భుత రచయిత: కేంద్ర మాజీ మంత్రి నట్వర్

ఈ ఉద‌యం 8 గంటల వ‌ర‌కు అప్ డేట్ చేసిన డేటా ప్ర‌కారం.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 1,19,264కి చేరుకున్నాయి. ఇది మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.27 శాతంగా ఉంది. కొత్తగా 15,815 కరోనా వైరస్ కేసులు, 68 మరణాలతో క‌లుపుకొని దేశంలో మొత్తంగా 4,42,39,372 కేసులు అయ్యాయి. తాజాగా క‌రోనా వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య‌తో క‌లుపుకొని దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,26,996 కు చేరుకున్నాయి.

జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా న‌మోదైంది. తాజా డేటా ప్ర‌కారం.. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,35,93,112 కు పెరిగింది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 207.71 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ల‌ను అందించారు.

'ప్ర‌త్యేక సేన భ‌వ‌న్' ఏర్పాటు యోచ‌న‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

భారతదేశలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీ నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీ నాటికి 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలు, అక్టోబర్ 11వ తేదీ నాటికి 70 లక్షలు, అక్టోబర్ 29వ తేదీ నాటికి 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. గ‌తేడాది మే 4వ తేదీన కోవిడ్ -19 కేసులు రెండు కోట్లుగా న‌మోదు అయ్యాయి. అలాగే జూన్ 23వ తేదీన మూడు కోట్లు కేసులుగా రికార్డుల‌కు ఎక్కింది. కాగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన మొత్తం నాలుగు కోట్ల కేసులు దాటాయి.

సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్.. మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి..

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల‌కు ఇటీవ‌ల లేఖ‌లు రాసింది. రాష్ట్రంలో త‌గినంత‌గా పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా ప్ర‌జ‌లు ప్రోత్స‌హించాల‌ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో వివిధ ఉత్సవాల కారణంగా సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉంద‌ని పేర్కొంది. కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది.

క‌రోనా విజృంభ‌న‌.. 24 గంట‌ల్లో 16 వేల కంటే ఎక్కువ కేసులు, 54 మ‌ర‌ణాలు న‌మోదు..
భార‌త్ లో మ‌ళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. రోజు రోజుకు ఈ కేసుల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో  16,047 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే కోవిడ్ వ‌ల్ల 54 మంది మ‌ర‌ణించారు. తాజా గ‌ణాంకాల‌తో దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 4,41,90,697, మ‌ర‌ణాలు 5,26,826 గా రికార్డు అయ్యాయి.

ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 3,546 తగ్గి మొత్తంగా 1,28,261కి చేరుకున్నాయి. COVID-19 రికవరీ రేటు 98.52 శాతంగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైందని, వారానికోసారి పాజిటివిటీ రేటు 4.90 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘జెండా కొనకుంటే రేషన్ సరుకులు ఇవ్వం’ వీడియోపై బీజేపీ ఎంపీ ఫైర్.. సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు

మంత్రిత్వ శాఖ వివ‌రాల ప్ర‌కారం.. రికవరీల సంఖ్య 4,35,35,610గా ఉంది. దేశ వ్యాప్తంగా డ్రైవ్ కింద ఇప్పటి వరకు 207.03 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు. 48 కొత్త మరణాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌ల నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఐదుగురు, హిమాచల్‌ప్రదేశ్‌, మిజోరాం నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఒడిశా, సిక్కిం, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్ నుంచి ఒక్కొరు చొప్పున ఉన్నారు.

భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఇదిలా ఉండ‌గా.. ఈ ఏడాది మొద‌టి నుంచి జూలై 19 వరకు భారతదేశంలో 45,000 కంటే ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదు అయ్యాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం లోక్ స‌భ‌లో వెల్ల‌డించింది. ఇందులో 22 000 కంటే ఎక్కువ కేసులు కేర‌ళ నుంచే ఉన్నాయ‌ని చెప్పింది. త‌రువాత మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయ‌ని పేర్కొంది. కేర‌ళ‌లో ఈ ఏడాది మొత్తంగా 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 13 లక్షల కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో దాదాపు 10 లక్షల కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో జూలై 19 వరకు దాదాపు 8 లక్షల కోవిడ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.

ఈ సంవత్సరం జనవరి నుండి 45,704 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఒక్క కేరళలోనే 22,843 మంది చ‌నిపోయారు. ఈ సంఖ్య 2021 లో 44,399 ఉండ‌గా.. 2020లో 3,042 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 240 మరణాలు నమోదు కాగా, తెలంగాణలో ఈ ఏడాది కోవిడ్ కారణంగా 86 మరణాలు నమోదయ్యాయి. అండమాన్, నికోబార్ దీవులు, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ లో మాత్ర‌మే ఈ ఏడాది కోవిడ్  వ‌ల్ల ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. క‌రోనా వ‌ల్ల ల‌క్షద్వీప్‌లో ఒకరు మరణించగా.. లడఖ్‌లో తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.

బీహార్ రాజ‌కీయాలు.. నితీష్ కుమార్ పొలిటిక‌ల్ ఎత్తుగడపై రాజకీయ నేతలు ఏమ‌న్నారంటే...?

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. రాష్ట్రంలో త‌గినంత‌గా పరీక్షలు నిర్వహించాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా ప్ర‌జ‌లు ప్రోత్స‌హించాల‌ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో వివిధ ఉత్సవాల కారణంగా సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉంద‌ని తెలిపింది. కాబ‌ట్టి అల‌ర్ట్ గా ఉండాల‌ని పేర్కొంది.

corona virus : పెరుగుతున్న క‌రోనా.. 24 గంట‌ల్లో 19,400 కొత్త కేసులు, 49 మరణాలు న‌మోదు
క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ‌త కొంత కాలం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టి కేసులు ఇప్పుడు మ‌ళ్లీ య‌థావిధిగా అధికం అవుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 19,406 కొత్తగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు న‌మోదు అయ్యాయి. దీంతో భార‌త్ లో కేసుల సంఖ్య 4,41,26,994కి పెరిగింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,793కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

అర్పిత ప్రాణాలకు ముప్పు ఉంది.. జైల్లో ఆహారం, నీరు తనిఖీ చేయండి - ఈడీ త‌రుఫు న్యాయ‌వాది

నేటి ఉద‌యం (శ‌నివారం) 8 గంట‌ల వ‌ర‌కు అప్ డేట్ చేసిన డేటా ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 49 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,26,649కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Covid-19: కరోనా దెబ్బతో తగ్గుతున్న మెదడు జీవితకాలం.. తాజా అధ్యయనం వెల్ల‌డి

యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 571 కేసుల తగ్గుదల నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైందని, వారంవారీ సానుకూలత రేటు 4.63 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  రికవరీల సంఖ్య 4,34,65,552కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో కోవిడ్‌కు వ్యతిరేకంగా 205.92 కోట్ల డోసులు అందించారు.

భారతదేశలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీ నాటికి 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీ నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీ నాటికి 50 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలు, అక్టోబర్ 11వ తేదీ నాటికి 70 లక్షలు, అక్టోబర్ 29వ తేదీ నాటికి 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది.

Monkeypox: "నానాటికీ కేసులు పెరగ‌వ‌చ్చు..మరిన్ని మరణాలు సంభవించవచ్చు": WHO

గ‌తేడాది మే 4వ తేదీన కోవిడ్ -19 కేసులు రెండు కోట్లుగా న‌మోదు అయ్యాయి. అలాగే జూన్ 23వ తేదీన మూడు కోట్లు కేసులుగా రికార్డుల‌కు ఎక్కింది. కాగా ఈ ఏడాది జనవరి 25వ తేదీన మొత్తం నాలుగు కోట్ల కేసుల మైలురాయిని భారత్ దాటింది.

corona virus : కోవిడ్ ఫోర్త్ వేవ్.. మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్ని న‌మోదు అయ్యాయంటే ?
కొంత కాలం కింద‌ట వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన కరోనా కేసులు.. ఇటీవ‌ల మ‌ళ్లీ పెరుగుతున్నా. ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కాగా ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్ లో కొత్త  19,673 కోవిడ్ -19 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 44,019,811కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం (జూలై 31, 2022) త‌న అధికారిక వెబ్ సైట్ లో పొందుప‌ర్చింది.

ఈ తాజా స‌మాచారం ప్ర‌కారం..దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,676కి పెరిగింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 45 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,26,357కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 292 కేసులు పెరిగాయి.  కాగా దేశంలో ఒక్కరోజులో 19,336 రికవరీలు కూడా నమోదయ్యాయి. దీంతో వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,33,49,778కి పెరిగింది, కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

WB SSC Scam : అర్పితా ముఖ‌ర్జీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఈడీ ఫోక‌స్.. వీటి వెన‌క ఉన్న అస‌లు ఉద్దేశం ఏంటి ?

మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.33 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతం,  వీక్లీ పాజిటివిటీ రేటు 4.88 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆదివారం ఉదయం 8 గంటల వ‌ర‌కు 204.25 కోట్ల టీకాలు అందించారు. వీటిలో గ‌త 24 గంట‌ల్లోనే 31,36,029 డోస్‌లు అందించారు.

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగ‌స్టు 20వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును అధిగ‌మించింది.

శివసేన ఎంపీ సంంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

కాగా.. తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు క‌రోనా వ‌ల్ల మహారాష్ట్ర అత్య‌ధికంగా ప్ర‌భావితం అయ్యింది. ఈ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 80,45,606 మందికి వ్యాధి సోక‌గా.. 1,48,101 మంది మరణించారు. 67,17,856 కేసుల‌తో కేర‌ళ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 70,451 మంది రోగులు చ‌నిపోయారు. కర్ణాటకలో 40,05,671 కేసులు, 40,102 మరణాలు, తమిళనాడులో 35,42,779 కేసులు, 38,032 మరణాలు సంభవించాయి.

అయితే క‌రోనా వ‌ల్ల ప్ర‌భావితం అయిన‌ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే ఇప్పుడు అత్య‌ధికంగా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. మహారాష్ట్రలో రోజువారీ కేసులలో స్వల్ప తగ్గుదల క‌నిపిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఈ రాష్ట్రంలో 2,087 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే త‌మిళ‌నాడులో 1,548 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కేరళలో శనివారం 1,599 కొత్త మందికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటకలో 1,886 కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona virus : వేగంగా పెరుగుతున్న క‌రోనా.. దేశ వ్యాప్తంగా కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోదు అయ్యాయంటే ?
భారత్ లో కోవిడ్ -19 కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కూడా కొత్త‌గా కేసుల్లో పెరుగుద‌ల క‌నిపించింది. కాగా.. చాలా కాలం తర్వాత యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం (29 జూలై 2022) ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 20,409 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు (జూలై 28న) రోజు 20,557 కొత్త కేసులు నమోదయ్యాయి. జూలై 27వ తేదీన‌ 18,313 కొత్త కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. జూలై 01న 17,070 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

తోటి విద్యార్థినికి ‘ఐలవ్యూ’ చెప్పి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని.. బ్లాక్ మెయిల్..

కాగా తాజా కేసుల‌తో యాక్టివ్ కేసులు 1,43,988 కు చేరుకున్నాయి. 24 గంట‌ల్లో మొత్తంగా 32 మంది మ‌ర‌ణించారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య  5,26,258కి చేరుకుంది, మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.33 శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 2,335 కేసులుగా ఉన్నాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.12 శాతం, వారపు పాజిటివిటీ రేటు 4.82 శాతంగా నమోదైంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,09,484కి పెరిగింది. అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 203.60 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్  అంద‌జేశార‌ని మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Monkeypox : మంకీపాక్స్ వ్యాప్తి ల‌క్ష‌ణాలు గ‌తం కంటే భిన్నంగా ఉన్నాయ్.. వెల్లడించిన కొత్త అధ్యయనం

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగ‌స్టు 20వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును అధిగ‌మించింది.

కాగా కొత్త‌గా సంభ‌వించిన కోవిడ్ మ‌ర‌ణాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ముగ్గురు చొప్పున, ఛత్తీస్ ఘ‌డ్, పంజాబ్, ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు చొప్పున, చండీగఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూకశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ఉన్నారు.

యువతి ప్రాణం తీసిన అనుమానం.. పెళ్లి చేసుకోవాల్సిన ప్రేయసిని హతమార్చిన ప్రియుడు

మహారాష్ట్రలో 8041522 కేసుల‌తో మొద‌టి స్థానంలో ఉంది. వీరిలో 7879766 మంది కోలుకున్నారు. 6716247  కేసుల‌తో రెండో స్థానంలో కేర‌ళ, 4001655 కేసులతో క‌ర్ణాట‌క మూడో స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు తమిళనాడులో 3539607, ఆంధ్రప్రదేశ్‌లో 2331092, ఉత్తరప్రదేశ్‌లో 2100981, పశ్చిమ బెంగాల్‌లో 2090483, ఢిల్లీలో 1951930, ఒడిశాలో 1310115, రాజస్థాన్‌లో 1293457, గుజరాత్‌లో 1252089 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Precautionary Dose : నేటి నుంచే కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫ్రీ ప్రికాష‌న‌రీ డోస్ డ్రైవ్.. ఎవ‌రు అర్హులంటే ?
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్త‌వుతోన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ నేటి (శుక్రవారం) నుంచి ఫ్రీ ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు)లను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గ‌త బుధ‌వారమే ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ 75 రోజుల పాటు కొన‌సాగనుంది. ఈ స‌మ‌యంలో అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఈ సౌక‌ర్యం అందుబాటులో ఉండ‌నుంది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 14 సార్లు బలవంతపు అబార్షన్.. మహిళ ఆత్మహత్య..

‘‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ జూలై 15, 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు ప్రభుత్వ టీకా కేంద్రాలలో ఉచిత COVID-19 ప్రికాష‌న్ డోసు అందించ‌బ‌డుతుంది. ఈ నిర్ణ‌యం విష‌యంలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ ఈ నిర్ణయం కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం పోరాటాన్ని మరింత బలపరుస్తుంది. అదనపు భద్రతను ఏర్ప‌రుస్తుంది. అర్హులైన వారందరినీ వీలైనంత త్వరగా ఈ ప్రికాష‌న‌రీ డోసును పొందాలని నేను కోరుతున్నాను ’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బుధవారం ఉదయం 7 గంటల వరకు భార‌త్ లో COVID-19 టీకా కవరేజీ 199.12 కోట్లకు మించిపోయింది. దీనిని 2,61,58,303 సెషన్ల ద్వారా అందించారు. అయితే కోవిడ్ -19కి వ్యతిరేకంగా 12-14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ ఏడాది  మార్చి 16న ప్రారంభించారు. ఇప్పటి వరకు 3.76 కోట్ల కంటే ఎక్కువ మంది యుక్త వయస్సు ఉన్న పిల్ల‌ల‌కు COVID-19 వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోసు అందించారు. అయితే 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రికాష‌న్ డోసు ఇవ్వ‌డం ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రారంభమైంది. అయితే దీనికి అంత పెద్ద స్థాయిలో స్పంద‌న రాలేదు.

కొవిడ్ దెబ్బతో జాతీయ పార్టీలకు తగ్గిన విరాళాలు.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎంత అంటే?

‘‘భారత జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితం రెండో మోతాదును పొందారు. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనాలు రెండు డోస్‌లతో ప్రాథమిక టీకా వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీ స్థాయిలు తగ్గుతాయని సూచించాయి. బూస్టర్ ఇవ్వడం రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది’’ అని ఓ అధికారి తెలిపారు అయితే 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 16 కోట్ల మంది అర్హులైన జనాభాలో 26 శాతం మంది  ప్రికాష‌న్ డోసు అందుకున్నార‌ని ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఇందులో ఎక్కువ‌గా హెల్త్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్‌లైన్ కార్మికులు బూస్టర్ డోస్ ఉన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం లబ్ధిదారులందరికీ COVID-19 వ్యాక్సిన్ రెండో, ప్రికాష‌న‌రీ డోసుల మోతాదుల మధ్య గ్యాప్ ను తొమ్మిది నుండి ఆరు నెలలకు తగ్గించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) నుండి సిఫార్సును అనుసరించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌న‌.. 145 రోజుల త‌రువాత ఒక్క సారిగా 20,000 కేసులు, 38 మ‌ర‌ణాలు న‌మోదు
దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. కేసులు ఒక్క సారిగా పెరుగుతున్నాయి. 145 విరామం త‌రువాత  20,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,36,076కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్ర‌క‌టించింది. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో మొత్తం 20,139 కొత్త కోవిడ్-19 కేసులు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తెలిపింది. ఈ తాజా లెక్క‌ల‌తో క‌లుపుకుంటే మొత్తంగా క‌రోనా కేసుల సంఖ్య 4,36,89,989కి చేరుకుంది.

భారీ వ‌ర్షాల‌తో థానేలో కూలిన ఇళ్లు.. అహ్మదాబాద్-ముంబయి నేష‌న‌ల్ హైవే మూసివేత

24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 38 కొత్త మ‌ర‌ణించారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 5,25,557కి చేరుకుంద‌ని గురువారం ఉద‌యం 8 గంటలకు అప్ డేట్ అయిన డేటా పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉండగా జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.37 శాతంగా నమోదైంది, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,28,356 కు పెరిగింది. అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.

విద్యార్థి కోసం కారు ప్రయాణం ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. గుజరాత్ లో అరుదైన ఘటన..

మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 199.27 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7వ తేదీన 20 లక్షలు, ఆగస్టు 23వ తేదీన‌ 30 లక్షలు, సెప్టెంబర్ 5వ తేదీన 40 లక్షలు, సెప్టెంబర్ 16వ తేదీన‌ 50 లక్షలు దాటింద‌ని పేర్కొంది.  సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. గ‌తేడాది మే 4న దేశంలో రెండు కోట్ల కేసుల మైలురాయిని అధిగమించింది. జూన్ 23న మూడు కోట్లు, ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇటీవల కోవిడ్ సోకడంతో..

తాజాగా న‌మోదైన 38 కొత్త మరణాలలో కేరళలో 16 మంది, మహారాష్ట్రలో 10 మంది, పశ్చిమ బెంగాల్ లో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, అస్సాం, బీహార్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఒక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు. మొత్తంగా మహారాష్ట్రలో 1,48,001, కేరళలో 70,186, కర్ణాటకలో 40,125, తమిళనాడులో 38,028, ఢిల్లీలో 26,288, ఉత్తరప్రదేశ్ లో 23,549, పశ్చిమ బెంగాల్ లో 21,255 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అయితే ఈ మ‌ర‌ణాల్లో 70 శాతం మంది కోమోర్బిడిటీల ఉండ‌టం వ‌ల్ల‌నే సంభవించాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం: చంద్రబాబు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు పౌరుషానికి, తెలుగువారి ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా... ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన అల్లూరిని దేశం స్మరించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు.

కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని, అమాయక ప్రజల దోపిడీని ఎదిరించి చిన్నవయసులోనే ప్రాణాలను త్యాగమిచ్చారని గుర్తుచేశారు. అటువంటి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుని ఆ మహానుభావుడికి నివాళులర్పించాల్సింగా తెలుగుప్రజలను, తెలుగుదేశం కార్యకర్తలను కోరుతున్నానని ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే అల్లూరి బ్రిటీష్ వారిని గడగడలాడించి.. గిరిజనులందరినీ సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగరని కొనియాడారు. అల్లూరి పోరాటం తట్టుకోలేక బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతమొందించారని తెలిపారు. 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు అంతమొందించినా.. ఆయన పోరాటం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిందని చంద్రబాబు చెప్పారు.

పార్లమెంటులో కూడా అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి మూలంగా నాటి వాజ్ పేయి ప్రభుత్వం  అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వాలు మారడంతో అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఇప్పటికైనా తెలుగువారి ఆకాంక్షను  నెరవేర్చాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టుగా చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీరుని చరిత్రను స్మరించుకుంటూ వారి స్మృతికి నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

Covid - 19 : కోవిడ్ మ‌హ్మ‌మ్మారి ఇంకా ఎక్క‌డికీ పోలేదు.. 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయ్ - WHO
కోవిడ్ మ‌హ‌మ్మారి ఇంకా మాన‌వాళిని విడిచి ఎక్క‌డికీ పోలేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయ‌ని హెచ్చ‌రించింది. COVID-19, ఇతర ప్రపంచ ఆరోగ్య సమస్యలపై  WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ ఈ మహమ్మారి తన రూపం మార్చుకుంటోంది. కానీ అది పూర్తిగా వెళ్లిపోలేదు. COVID - 19 వైరస్‌ని ట్రాక్ చేసే మన సామర్థ్యం, జెనోమిక్ సీక్వెన్సులు క్షీణిస్తున్నాయి. కాబట్టి ముప్పు పొంచి ఉంది. అంటే ఓమిక్రాన్‌ను ట్రాక్ చేయడం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న వేరియంట్‌లను విశ్లేషించడం కష్టంగా మారుతోంది ’’ అని అన్నారు.

Coronavirus: భారీగా నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు !

COVID- 19 చాలా చోట్ల BA.4, BA.5 గా కొనసాగుతోందని టెడ్రోస్ చెప్పారు. 110 దేశాలలో కేసులు  పెరుగుతున్నాయ‌ని అన్నారు. దీని వ‌ల్ల మొత్తం ప్రపంచ కేసులు 20 శాతం పెరిగాయ‌ని తెలిపారు. 6 డబ్ల్యూహెచ్ఓలో 3 ప్రాంతాల్లో మరణాలు పెరిగాయని అన్నారు. WHO అన్ని దేశాలు తమ జనాభాలో కనీసం 70 శాతం మందికి టీకాలు వేయాలని పిలుపునిచ్చిందని చెప్పారు. గడచిన 18 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

‘‘ ఒక వైపు తక్కువ ఆదాయ దేశాలలో పది లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులతో సహా వందల మిలియన్ల మంది ప్రజలు టీకాలు ఇప్ప‌టికీ టీకా అంద‌లేదు. అంటే వారు భవిష్యత్తులో వైరస్ వేవ్ ల‌కు ఎక్కువగా గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. కేవలం 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేధించడంతో, తక్కువ ఆదాయ దేశాలకు దీనిని సాధించడం సాధ్యం కాదని కొందరు చెప్పారు ’’ అని ఆయన అన్నారు. టీకా విషయంలో అత్యంత ప్రమాదంలో ఉన్న సమూహాలను గుర్తించ‌డం చాలా ముఖ్య‌మ‌ని తెలిపారు.

Lancet journal: దేశంలో 42 ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌ను త‌గ్గించిన కోవిడ్ టీకాలు !

Monkeypox ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్‌గా పరిగణించకపోయినప్పటికీ దీనిపై అత్యవసర ప్రతిస్పందనలు, ప్రయత్నాలు అవసరమని టెడ్రోస్ చెప్పారు. ‘‘ monkeypox వ్యాప్తి ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సూచిస్తుందని అత్యవసర కమిటీ సలహా ఇవ్వలేదు. వారు తీవ్రమైన ప్రతిస్పందన ప్రయత్నాలు అవసరమయ్యే ఈవెంట్ అత్యవసర స్వభావాన్ని అంగీకరించారు.’’ అని పేర్కొన్నారు. వైరస్ నిరంతర ప్రసారంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO డైరెక్టర్.. పిల్లలు, గర్భిణులకు సంక్రమణను పట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు.

‘‘ నిరంతర ప్రసారంపై నేను ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే వైరస్ తనంతట తానుగా స్థిరపడుతోంది. ఇది పిల్లలు, రోగనిరోధక శక్తి లేనివారు, గర్భిణులతో పాటు రిస్క్ లో ఉన్న గ్రూప్ లో వారి వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని సూచిస్తోంది’’ అని అన్నారు. నైజీరియా 2017 నుండి మంకీపాక్స్ వ్యాప్తితో పోరాడుతోందని ఆయన అన్నారు. దేశంలో ఈ సంవత్సరం ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంటే ఇప్ప‌టి వేవ్ గ‌త వేవ్ ల‌ను మించిపోయింద‌ని అన్నారు. ఈ వ్యాధి ఇప్పుడు 50 కంటే ఎక్కువ దేశాల్లో గుర్తించార‌ని అన్నారు.

Omicron subvariant : మ‌హారాష్ట్రలో మొద‌టి ఒమిక్రాన్ BA.4, BA.5 సబ్‌వేరియంట్ కేసులు గుర్తింపు..
మహారాష్ట్ర శనివారం తన మొదటి కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కొత్త వేరియంట్ కేసులను న‌మోదు చేసింది. పూణేలో ఒమిక్రాన్ స్ట్రెయిన్ BA.4, BA.5 సబ్‌వేరియంట్ లకు సంబంధించిన ఏడు కేసుల‌ను గుర్తించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం.. మొత్తం జెనోమిక్ సీక్వెన్సింగ్ లో పూణే నుండి వచ్చిన 7 కేసులలో 4 గురు రోగుల‌కు BA.4 వేరియంట్‌, మిగిలిన ముగ్గురికి BA.5 వేరియంట్ సోకినట్టు క‌నుగొన్నారు.

Monkeypox Virus: భయపడాల్సినవసరం లేదు.. కానీ, ఈ ల‌క్ష‌ణాలు ఉంటే.. : ICMR

ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గతంలో తమిళనాడు, తెలంగాణలో BA.4, BA.5 వేరియంట్‌లతో కేసులను నిర్ధారించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో BA.4 వేరియంట్‌కు సంబంధించి దేశంలో మొట్టమొదటి కేసు న‌మోదు అయ్యింది. మే ప్రారంభంలో అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని 19 ఏళ్ల మహిళలో BA.4 కేసు చెన్నైలో గుర్తించారు. INSACOG ప్రకారం.. ఆమె పూర్తిగా కోవిడ్ 19 వ్యాక్సిన్ లు తీసుకున్నారు. అయితే ఆమెకు తేలికపాటి క్లినికల్ లక్షణాలు ఉన్న‌ట్టు గుర్తించారు.

Covid-19: క‌రోనా.. మంకీపాక్స్ భ‌యాల మ‌ధ్య 16 దేశాల ప్ర‌యాణాల‌పై సౌదీ అరేబియా ఆంక్ష‌లు !

దక్షిణాఫ్రికాకు చెందిన ఒక ప్రయాణికుడిలో హైదరాబాద్ విమానాశ్రయంలో శాంప్లింగ్ సమయంలో ఞ‌క BA.4 కేసు కనుగొనబడింది. అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని హైదరాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తిలో BA.5 ను గుర్తించారు. అతడు కూడా కోవిడ్-19 పూర్తి వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాడు. తేలికపాటి క్లినికల్ లక్షణాలను మాత్రమే కలిగి ఉన్నాడు.

కాగా ఈ కొత్త వేరియంట్ ల‌పై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్య అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన‌ది చెప్పారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే దేశమంతటా గ‌తేడాది విస్త‌రించింది. కాబ‌ట్టి ఇది ఎక్కువ ప్ర‌భావాన్ని చూపలేదు. ఇది  డెల్టా వెర్షన్ వైరస్ కంటే తక్కువ తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు.

కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 2685 కొత్త కరోనా వైరస్ కేసుల‌ను అధికారులు గుర్తించారు. దీంతో   ఇప్పటి వరకు క‌రోనా సోకిన వారి సంఖ్య 4,31,50,215 కు పెరిగింది. అదే సమయంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 16,308కి చేరింది. గత 24 గంటల్లో, దేశంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా మరో 33 మంది రోగులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5,24,572 కు చేరుకుంది.

రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం ఎప్పటికీ పురోగమించదు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రస్తుతం దేశంలో 16,308 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన డేటా పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం కింద  ఇప్పటివరకు 193.13 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు దేశ ప్ర‌జ‌ల‌కు అందించారు.

కోవిడ్ సోకి తగ్గినా.. దాని ప్ర‌భావం రెండేళ్లకు పైగా ఉంటుంది - తేల్చిచెప్పిన కొత్త అధ్య‌యనం
కోవిడ్ -19 ప్ర‌పంచాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టిన వైర‌స్. 2019 సంవత్స‌ర నుంచి ఈ వైరస్ మ‌న చుట్టూనే తిరుగుతూ ఉంది. అనేక వేవ్ లు వ‌స్తున్నాయి. పోతున్నాయి. అయితే ఈ వైర‌స్ దాని ప్ర‌భావంపై ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో కొత్త అధ్య‌య‌నానికి సంబంధించిన ఓ ఫ‌లితం ఇటీవ‌ల వెలువ‌డింది. ఈ అధ్య‌య‌నం ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ లో ప్ర‌చురితం అయ్యింది. దీని ప్ర‌కారం కోవిడ్ సోకి త‌గ్గిన రెండు సంవ‌త్స‌రాల తరువాత కూడా రోగుల్లో స‌గం మంది క‌నీసం ఒక ల‌క్షణాన్ని చూపించారని అని తెలిపింది.

‘‘ ప్రారంభ వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కోవిడ్ -19 బాధితులు శారీరక, మానసిక ఆరోగ్యంలో దీర్ఘకాలిక మెరుగుదలను కలిగి ఉన్నారు. చాలా మంది రెండేళ్లలోపు వారి రోజు వారి జీవనంలోకి తిరిగి వచ్చారు. అయినప్పటికీ ఈ వ్యాధి లక్షణాల పర్యవసానాల భారం చాలా ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 నుండి బయటపడినవారు రెండేళ్లలో సాధారణ జనాభా కంటే గణనీయంగా అనారోగ్య స్థితిని కలిగి ఉన్నారు. సుదీర్ఘ కోవిడ్ వ్యాధి కారకాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని, దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన జోక్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి ’’ అని అధ్యయనం పేర్కొంది. ఈ అధ్య‌య‌నం దీర్ఘకాలిక కోవిడ్ ను ఎదుర్కోవటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.

‘‘ రెండు సంవత్సరాలలో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు అంటే జీవన నాణ్యత తగ్గడం, తక్కువ వ్యాయామ సామర్థ్యం, అసాధారణ మానసిక ఆరోగ్యం, డిశ్చార్జ్ తర్వాత ఆరోగ్య సంరక్షణ అధిక వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయి ’’ అని అధ్యయనం తెలిపింది. లాన్సెట్ అధ్యయనంలో కోవిడ్ సోకిన రోగుల్లో రెండేళ్ల పాటు అలసట అనేది తరచుగా కనిపించిందని పేర్కొంది. ‘‘ ప్రారంభ వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా మా పరిశోధనలకు అనుగుణంగా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) రికవరీ దశలో అలసట అధిక ప్రాబల్యం కూడా గమనించబడింది. ఇది నాలుగు సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ’’ అని తెలిపింది.

2020 జనవరి 7. మే 2వ తేదీన వుహాన్ జిన్ యిన్-టాన్ హాస్పిటల్‌లో చేరి తీవ్రమైన కోవిడ్-19తో బాధపడుతున్న 1,192 మంది వ్యక్తులు ఈ అధ్యయనంలో ఉన్నారు. ఆరు నెలలు, 12 నెలలు, రెండు సంవత్సరాలలో చేసిన అధ్యయనాలు ఫలితాలపై ఇందులో అధ్యయనం జరిగింది. ఈ అధ్య‌య‌నంలో కీలకంగా ఉన్న చైనాలోని చైనా-జపాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావో మాట్లాడుతూ..   ‘‘ కోవిడ్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చేరి, తరువాత బయటపడిన వారు కొంత భాగానికి వారు ప్రారంభ సంక్రమణను క్లియర్ చేసినప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కోవిడ్ -19 ఉన్న గణనీయమైన నిష్పత్తిలో ప్రజలకు నిరంతర మద్దతును అందించాల్సిన అవసరం ఉంది. టీకాలు, అభివృద్ధి చెందుతున్న చికిత్సలు, వేరియంట్లు దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ’’ అని చెప్పారు.

coronavirus : క‌రోనా క‌ల‌క‌లం.. 60 మంది పాటియాలా లా యూనివర్సిటీ స్టూడెంట్ల‌కు కోవిడ్
పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (RGNUL)కి చెందిన 60 మంది స్టూడెంట్ల‌కు క‌రోనా సోకింది. అంత మంది స్టూడెంట్ల‌కు ఒకే సారి క‌రోనా సోక‌డం యూనివ‌ర్సిటీలో క‌ల‌క‌లం రేపింది. దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

కోవిడ్ పాజిటివ్ గా తేలిన స్టూడెంట్లంద‌రికీ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వారంద‌రినీ ప్రత్యేక బ్లాక్‌లలో ఒంటరిగా ఉంచారు. గ‌డిచిన రెండు రోజుల్లోనే ఇంత మంది స్టూడెంట్లు క‌రోనా బారిన ప‌డ్డార‌ని యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండ‌గా కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి మే 10 లోపు హాస్టళ్లను ఖాళీ చేయాలని విశ్వవిద్యాలయ అధికారుల మిగితా  స్టూడెంట్ల‌ను కోరారు.

క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో RGNUL కోవిడ్ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ స‌మావేశంలో వైద్య నిపుణులు స‌ల‌హాల ప్ర‌కారం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎండ్-టర్మ్ పరీక్షలు వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం మ‌ళ్లీ షెడ్యూల్ రూపొందించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫ్ లైన్ లో కొన‌సాగిన క్లాస్ లు మిగితా సిల‌బ‌స్ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు ఆన్ లైన్ లో కొన‌సాగుతాయి.

ఈ విష‌యంలో యూనివ‌ర్సిటీ అడ్మినిస్ట్రేష‌న్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో లా నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్న 44 మంది స్టూడెంట్ల‌కు మంగ‌ళ‌వారం క‌రోనా సోకింద‌ని, వీరి రిపోర్టులు బుధ‌వారం ఉద‌యం వ‌చ్చాయ‌ని తెలిపారు. మిగిలిన స్టూడెంట్లను కోవిడ్ నుంచి దూరంగా ఉంచ‌డానికి హాస్ట‌ల్స్ ను ఖాళీ చేయాల‌ని సూచించామ‌ని తెలిపారు. స్టూడెంట్లు అంద‌రూ కలిసి మెలిసి అక్కడక్కడే తిరుగుతూ ఉంటార‌ని చెప్పారు. అందుకే క‌రోనా వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. దీనిని నివారించ‌డానికే స్టూడెంట్ల‌కు హాస్ట‌ల్స్ ఖాళీ చేయ‌ల‌ని చెప్పామ‌ని తెలిపారు.

Coronavirus : కరోనా కలవరం.. ఢిల్లీలో పెరుగుతున్న ఇన్ ఫెక్షన్.. ఒక్క రోజే 1367 కేసుల నమోదు..
దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో కోవిడ్ పెరుగుతోంది.  ఆ ప్రాంతంలో రోజు రోజుకు కేసులు ఎక్కువ‌వుతోంది. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురువుతున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ.. హాస్పిటలో చేరికలు, మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గానే ఉండ‌టం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో 1,367 తాజా COVID-19 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో పాటు కరోనాతో ఒక‌రు మృతి చెందారు. ఢిల్లీలో సానుకూలత రేటు 4.50 శాతంగా ఉంది. ఈ మేర‌కు ఆరోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ డేటా ప్ర‌కారం రాజధానిలో ఒక రోజులో వెయ్యికి పైగా కొత్త కేసులు న‌మోద‌వ‌డం వ‌రుస‌గా ఇది ఆరో రోజు.

మొత్తంగా దేశ రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 18,78,458 కి చేరుకుంది. తాజా మ‌ర‌ణంతో క‌లుపుకుంటే మ‌ర‌ణాల సంఖ్య 26,170కి చేరుకుందని బులెటిన్ పేర్కొంది. మంగ‌ళ‌వారం మొత్తం నగరంలో 30,346 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. అంత‌కు ముందు రోజు 1,204 COVID-19 కేసులు, ఒక మరణం నమోదైంది. అయితే పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది. సోమ‌వారం నాడు 6.42 శాతం పాజిటివ్ రేటుతో 1,011 కేసులు న‌మోద‌య్యాయి. ఒక మ‌ర‌ణం సంభ‌వించింది.

కాగా ఆదివారం 1,083 కొత్త COVID-19 కేసులు న‌మోద‌య్యాయి. ఆ రోజు 4.48 శాతం పాజిటివ్ రేటు న‌మోద‌వ్వ‌గా.. క‌రోనాతో ఒక‌రు మృతి చెందారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నెల నుంచే క‌రోనా కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరే రేటు తక్కువగా ఉందని హెల్త్ బులిటెన్ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులలో మూడు శాతం కంటే తక్కువ మంది హాస్పిట‌ల్ లో చేరుతున్నార‌ని పేర్కొంది.  ప్రస్తుతం 129 మంది కోవిడ్-19 రోగులు ఢిల్లీలోని వివిధ హాస్పిట‌ల్ లో చేర‌గా..  3,336 మంది హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ ఆసుపత్రుల్లో COVID-19 రోగులకు కోసం 9,390 పడకలు అందుబాటులో ఉండ‌గా అందులో 1.58 శాతం మాత్ర‌మే పేషెంట్ల‌తో నిండిపోయాయ‌ని తెలిపింది.

కరోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఢిల్లీ ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఫోర్ వీల‌ర్ వాహ‌నాల్లో క‌లిసి ప్రయాణించే వారికి జరిమానా వర్తించదని పేర్కొంది. అయితే రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టిన నేప‌థ్యంలో ఏప్రిల్ 12వ తేదీన మాస్క్ త‌ప్పనిస‌రి అనే నిబంధ‌నను ఎత్తేసింది. ఫైన్లు కూడా ఉండ‌వ‌ని పేర్కొంది.

కాగా ఇటీవ‌ల జాతీయ రాజధాని కోసం COVID-19 నిర్వహణ విధానాలను రూపొందించే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో మ‌ళ్లీ మ‌స్క్ త‌ప్పనిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మాస్క్ ధ‌రించ‌ని వారికి జ‌రిమానా విధించాల‌ని కూడా అధికారులు నిర్ణ‌యించారు. ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వ టీకా కేంద్రాలలో 18-59 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఉచితంగా అందించే కార్య‌క్ర‌మం ప్రారంభించిన‌ట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది.

Coronavirus : ఫోర్త్ వేవ్ టెన్ష‌న్.. ఢిల్లీలో 1200 కోవిడ్ కొత్త కేసులు, మ‌హారాష్ట్రలో నలుగురు మృతి..
క‌రోనా క‌ల‌వర‌పెడుతోంది. కొంత కాలం కింద‌టి వ‌ర‌కు తగ్గుముఖం పట్టిన క‌రోనా కేసులు ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో మ‌ళ్లీ ప‌లు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలు మ‌ళ్లీ విధించ‌డం ప్రారంభించాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో ఈ కోవిడ్ కేసులు అధికంగా న‌మోదవుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ రాజధాని ఢిల్లీలో 1204 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో పాటు ఒక మ‌ర‌ణం కూడా సంభ‌వించింది. 863 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం హెల్త్ బులిటిన్ విడుద‌ల చేసింది. కాగా ఢిల్లీలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఐదో రోజు. దీంతో దేశ రాజధానిలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4508కి చేరుకుంది.

హెల్త్ బులిటెన్ లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.42 శాతం నుంచి 4.64 శాతంకు పడిపోయింది. కరోనా కేసులు పెరిగినప్పటికీ హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఢిల్లీలో యాక్టివ్ గా ఉన్న కేసుల్లో మొత్తం 3109 కోవిడ్ పాజిటివ్ రోగులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. 114 మంది మాత్రమే ఆసుపత్రులలో చేరారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో గ‌డిచిన 24 గంటల్లో 153 క‌రోనా కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. 135 మంది క‌రోనాతో కోలుకున్నారు. అయితే క‌రోనాతో న‌లుగురు మృతి చెందారు. దీంతో మహారాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు ఇప్పుడు 943కి చేరుకున్నాయి. ఈ కేసుల్లో అత్య‌ధికంగా ముంబైలోనే కేసులు ఉన్నాయి. ఆ సిటీలో మొత్తంగా 549 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కాగా త‌మిళ‌నాడులో గ‌డిచిన 24 గంట‌ల్లో 77 కోవిడ్ -19 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రాష్ట్రంలో క‌రోనాతో 38,025 మంది చ‌నిపోయారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా కేసులు పెరుగుతుండంతో ఢిల్లీతో పాటు హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు జిల్లాలో మాస్కుల వినియోగాన్ని ఆయా ప్ర‌భుత్వాలు త‌ప్పనిస‌రి చేశాయి. ఈ జిల్లాన్నీ ఎన్ సీఆర్ చుట్టుప‌క్క‌లే ఉన్నాయి. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా కోవిడ్-19 పాల్గొన్నారు.

Coronavirus : ఫోర్త్ వేవ్ టెన్ష‌న్.. ఢిల్లీలో ఒక్క రోజులోనే వెయ్యికిపైగా కొత్త క‌రోనా కేసులు,,
దేశ రాజధానిలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో ఢిల్లీలో వెయ్యికి పైగా కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అధికారులు విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం మొత్తంగా 1009 కోవిడ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2641కి చేరింది. క‌రోనా వ‌ల్ల గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఒక‌రు మ‌ర‌ణించారు. 314 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 5.70 శాతానికి పెరిగింది. కాగా మంగళవారం ఢిల్లీలో 632 కరోనా కేసులు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా న‌మోదైంది. దేశ రాజ‌ధానిలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించడం ప్ర‌భుత్వం తప్పనిసరి చేసింది.  దీని ప్ర‌కారం ప్ర‌జ‌లు నిబంధ‌లు ఉల్లంఘిస్తే వారికి రూ.500 జరిమానా విధిస్తారు. బుధవారం జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ కోసం నిపుణుల నుండి తీసుకున్న సలహాల ఆధారంగా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలు చేస్తామ‌ని చెప్పారు. సామాజిక సమావేశాలపై నిశితంగా ప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని, దేశ రాజధానిలో COVID-19 పరీక్షల సంఖ్యను పెంచాలని అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రోగులకు చికిత్స అందించ‌డాని అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను ఆదేశించిన‌ట్టు ఉన్న‌తాధికారులు చెప్పారు. అర్హులైన అంద‌రికీ టీకా అందించేలా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయాల‌ని ఈ ఈ డీడీఎంఏ సమావేశంలో అధికారులు నిర్ణ‌యించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంద‌ని అన్నారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వచ్చే పక్షం రోజుల్లో ఆసుపత్రిలో చేరే రోగుల సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించాల‌ని సమావేశంలో ఉద్ఘాటించారు. అలాగే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ అయిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాల‌ని నిర్ణ‌యించారు.

కాగా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్ అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అంటువ్యాధుల వ్యాప్తిపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండగా దేశ రాజధాని చుట్టుపక్కల ఉన్న ఇతర రాష్ట్రాల జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు ఆ జిల్లాలో ఫేస్ మాస్కులు ఉపయోగించడం తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ను తప్పకుండా ధరించాలని చెప్పింది. అలాగే హర్యానా ప్రభుత్వం కూడా గురుగ్రామ్‌, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్ జిల్లాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Coronavirus : క‌రోనా క‌ల‌వరం.. భార‌త్ లో ఒకే రోజు 2,067 కొత్త కోవిడ్ కేసులు న‌మోదు..
క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌తో పాటు మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల్లో పెరుగుద‌ల‌ క‌నిపిస్తోంది. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, దాని చుట్ట‌ప‌క్క‌ల ఉన్న జిల్లాల్లో అధికంగా ఇన్ఫెక్ష‌న్లు న‌మోదు అవుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 2,067 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.

తాజా క‌రోనా గ‌ణాంకాల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం మంగ‌ళవారం ఒక్క రోజే 2,067 కొత్త కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 4,30,47,594కి పెరిగింది. యాక్టివ్ కేసులు 12,340కి పెరిగాయి. 40 తాజా కరోనా మరణాలు  నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,22,006కి చేరుకుంది.

మొత్తం కరోనా ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.49 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.38 శాతంగా నమోదైందని తెలిపింది. మొత్తంగా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,25,13,248కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 186.90 కోట్లకు మించి డోసులు అంద‌జేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఆయా రాష్ఠ్ర ప్ర‌భుత్వాలు క‌రోనా ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నుంచి రాజధాని లక్నోతో పాటు ఎన్‌సీఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదల జాతీయ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోకి వచ్చే జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేసినట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత హర్యానా ప్రభుత్వం కూడా త‌న నాలుగు జిల్లాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గురుగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల పెరుగుదల పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంతో పాటు ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్ జిల్లాలలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణ‌యాన్ని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. కాగా కోవిడ్ -19 కేసుల పెరుగుద‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్క్ ధ‌రించాల‌ని చెబుతున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే పరీక్ష‌లు చేయించుకోవాని చెబుతున్నారు.

Coronavirus : పెరుగుతున్నకోవిడ్ కేసులు.. 7 జిల్లాల్లో మ‌ళ్లీ మాస్క్ తప్ప‌నిస‌రి.. ఎక్క‌డంటే ?
మ‌ళ్లీ కోవిడ్ టెన్ష‌న్ పెడుతోంది. కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌తో పాటు మ‌న దేశంలోనూ ఈ ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో కేసుల పెరుగుదలలో వేగం క‌నిపిస్తోంది. దీంతో అంద‌రిలో ఆందోళ‌న మొద‌లైంది. ఇటీవ‌లే క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌భుత్వం ఆంక్ష‌లు ఎత్తేశాయి. కానీ మ‌ళ్లీ ఇప్పుడు ఆంక్ష‌లు విధించ‌డం ప్రారంభించాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాజధాని లక్నోతో పాటు ఎన్‌సీఆర్ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఢిల్లీలో కోవిడ్ కేసుల పెరుగుదల జాతీయ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోకి వచ్చే జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పత్‌తో పాటు రాజధాని లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేసినట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు.

గ‌డిచిన 24 గంటల్లో గౌతమ్ బుద్ధ నగర్‌లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా కోవిడ్ -19 కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలోనే ఫేస్ మాస్కులు త‌ప్పనిస‌రి కాద‌ని చెప్పింది. అయితే ఈలోపే కేసులు పెరుగుతుండటంతో కొన్ని జిల్లాలో మాస్క్ త‌ప్ప‌నిసరి చేసింది.

అయితే కోవిడ్ -19 కేసుల్లో పెరుగుద‌ల క‌నిపిస్తుండ‌టంతో ఢిల్లీ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తనిఖీ చేయడంలో సహాయపడటానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని  ఢిల్లీ వైద్యులు అధికారులను కోరారు. కోవిడ్ వంటి లక్షణాలు క‌లిగి ఉన్న వ్య‌క్తులు తమను తాము పరీక్షించుకోవాలని, వ్యాప్తిని నిరోధించడానికి క్వారంటైన్ లో ఉండాల‌ని కోరుతున్నారు. మ‌ళ్లీ కేసుల పెరుగుదల నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు పెంచాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని నొక్కి చెప్పారు. అయితే, ఇప్పుడే కఠినమైన ఆంక్షలు అవసరం లేదని తెలిపారు.

NCR ప‌రిధిలో ఉన్న న‌గ‌రాల్లో క‌రోనా కేసుల పెరుగ‌దలో వేగం క‌నిపిస్తోంది. ఢిల్లీకి చుట్టుప‌క్క‌ల ఉండే రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కారణంగా, దేశంలో కోవిడ్ క్రియాశీల కేసులు 12,000 కి చేరుకుంది. గత ఏడు రోజుల్లో కొత్త కోవిడ్-19 కేసుల సంఖ్య 35 శాతం పెరిగిన‌ట్టు అధికారిక గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. హర్యానాలో ఈ వారంలో కేసులు 1,119కి పెరిగాయి. ఇది గత వారం 514గా ఉన్నాయి. అంటే దాదాపు  118 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. అలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో గ‌తం వారం 224 కేసులు ఉండ‌గా.. ఈ  వారం 540 కేసులతో న‌మోదు అయ్యాయి. అంటే 141% పెరుగుదలను నమోదు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా NCR ఆనుకొని ఉన్న గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లోనే కొత్త కేసులు ఎక్కువ‌గా న‌మోదు అయ్యాయి.