మీ జీవిత భాగస్వామిలో ఇలాంటి మార్పు.. ఎఫైర్ కావచ్చు..!

వారు డిఫరెంట్ గా ప్రవర్తించడం.. ప్రతి విషయాన్ని మీ దగ్గర సీక్రెట్ గా ఉంచడం, మీకు దూరం దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారంటే మీరు కచ్చితంగా వారిని అనుమానించాల్సిందే.

Warning signs Your Spouse is Having an affair

ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ... ఈ మధ్య చాలా మంది  తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. తమ జీవిత భాగస్వామిని కాదని.. మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటున్నారు. అయితే.. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసుకోవడమోలా..? మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1.మీ భాగస్వామి ప్రవర్తనలో సడెన్ గా మార్పు వచ్చిందంటే వారిపై మీరు ఓ కన్నేయాలి. వారు డిఫరెంట్ గా ప్రవర్తించడం.. ప్రతి విషయాన్ని మీ దగ్గర సీక్రెట్ గా ఉంచడం, మీకు దూరం దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారంటే మీరు కచ్చితంగా వారిని అనుమానించాల్సిందే.

2.మీ భాగస్వామి వారి ఫోన్ మీకు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారా..? వారు వారి ఫోన్  పాస్ కోడ్ కూడా మీకు తెలీకుండా ఉండాలని జాగ్రత్తపడుతున్నారా..? కనీసం ల్యాప్ టాప్, సోషల్ మీడియా ఖాతాలను కూడా దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే కూడా వారిపై మీరు  ఓ కన్నేయాల్సిందే.

3.ఇంతకాలం పట్టించుకోకుండా ఉన్న అందంపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టడం, మంచి దుస్తులు వేసుకోవాలని, అందంగా కనిపించాలని ప్రయత్నిస్తుండటం చేస్తున్నారంటే... వారు ఎవరినో ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అర్థం.

4.మీ భాగస్వామి ఎక్కువ సేపు ఇంట్లో ఉండకుండా... వేరే ఎక్కడికో వెళ్తున్నా... మీతో సమయం గడపడానికి పెద్దగా ఆసక్తి చూపిచడం లేదు అన్నా.. వారికి ఎఫైర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం.

5.ఎప్పుడూ మీతో ప్రేమగా ఉండే మీ భాగస్వామి సడెన్ గా...మీతో ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు అంటే ఆలోచించాల్సిందే. మీతో కాసేపు మాట్లాడాలన్నా విసుక్కోవడం, మీ ఫోన్స్ ఎవాయిడ్ చేయడం లాంటివి చేస్తున్నారు అంటే వారు మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నారనే అర్థం.

6.మీరు మీ భాగస్వామిని ఎక్కడున్నావ్ ..? ఏం చేస్తున్నావ్ లాంటి ప్రశ్నలు అడిగితే.. వారికి విపరీతమైన కోపం రావడం లాంటివి జరుగుతున్నాయంటే కూడా మీరు ఆలోచించాల్సిందే. వారు మీ దగ్గర వారు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని వీలైనంత వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటే... వారిని అనుమానించాల్సిందే.

7.మీ భాగస్వామి మీకు తెలీకుండా... బహుమతులు, ఏదైనా కాస్ట్ లీ వస్తువుల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారన్నా కూడా మీరు ఆలోచించాల్సిందే. వారు ఆ బహుమతులు ఎవరికి ఇస్తున్నారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

8.మీ భాగస్వామి మీతో శృంగారం పరంగా కూడా దూరం పెడుతున్నాడు అంటే కూడా ఆలోచించాలి. మీతో శృంగారానికి దూరం పెడుతున్నారంటే... మరొకరితో శారీరకంగా దగ్గరౌతున్నారని అర్థం చేసుకోవాలి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios