ఉదయాన్నే శృంగారం ఎందుకు చేయాలో తెలుసా..?
ఇలాంటి ఉత్సాహం ఉదయంపూట శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కలుగుతుందట. అంతేకాదు... లిబిడోను యాక్టివేట్ చేస్తుంది. జంటల మధ్య ఎమోషనల్ బాండింగ్ పెంచడానికి సహాయం చేస్తుంది.
శృంగారం ఒక తెలియని అనుభూతి వస్తుంది. ఎవరికైనా దీని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు కలయికను ఆస్వాదించలేకపోతున్నారట. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు. కానీ... దంపతులు శృంగారానికి దూరమౌతున్నారన్నది మాత్రం నిజం. అలాంటివారు... మార్నింగ్ సెక్స్ పై ఫోకస్ పెడితే.... వారి సమస్యలన్నీ దూరమైపోతాయట. కలయికను మరింతగా ఆస్వాదించగలరట. అదెలా..? మార్నింగ్ సెక్స్ వల్ల కలిగే లాభాలు ఏంటి..? దాని పై ఉత్సాహం ఎలా వస్తుందో ఓసారి చూద్దాం...
ఉదయం పూట శృంగారం అనేది... బ్రేక్ ఫాస్ట్ సమయంలో డిసర్ట్ లాంటిది. మనకు ఉదయం అల్పాహారం తీసుకుంటే ఉత్సాహం వస్తుంది. అదే డిసర్ట్ తీసుకుంటే... ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఇలాంటి ఉత్సాహం ఉదయంపూట శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కలుగుతుందట. అంతేకాదు... లిబిడోను యాక్టివేట్ చేస్తుంది. జంటల మధ్య ఎమోషనల్ బాండింగ్ పెంచడానికి సహాయం చేస్తుంది. ఇంకా దీని వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం...
ఈ మధ్యకాలంలో చాలా మంది పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పగలంతా పని చేసే వారికి... రాత్రిపూట కలయికలో పాల్గొనడానికి ఓపిక ఉండటం లేదు. దీంతో.... దాని పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు. అలాంటివారు ఉదయంపూట శృంగారంలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ... ఉదయం నుంచే ఉత్సాహం పెరుగుతుంది. ఉదయం పూట కలయికలో పాల్గొనడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలం. ఆనందంగా పెరుగుతుంది.
చాలా మంది దంపతులు చేస్తున్న ఫిర్యాదు ప్రకారం... తమ పార్ట్ నర్ శనివారం రాత్రి కలయికలో బాగా రెచ్చిపోతున్నారు కానీ... వీక్ డేస్ లోల మాత్రం అస్సలు ఉత్సాహం చూపించడంలేదని చెబుతున్నారు. అదే కనుక... వారు ఉదయం పూట కలయికలో పాల్గొనడం అలవాటు చేసుకోవడం వల్ల వీక్ డేస్ లో కూడా ఉత్సాహంగా రెచ్చిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయంపూట సెక్స్ లో పాల్గొనడం వల్ల... పురుషుల్లో టెస్టో స్టెరాన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుంది. అంతేకాదు... బెడ్ పై ఉల్లాసంగా పాల్గొనడం వల్ల ఎండార్ఫిన్ ు విడుదల అవుతాయి. ఇవి మనకు తీయని అనుభూతి కలిగిస్తాయి.
ఇక... కలయికను ఆస్వాదించడం వల్ల ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకపోతే... కలయికను ఎక్కువగా ఆస్వాదించే అవకాశం ఉంటుందట. అయితే... ఉదయం సెక్స్ చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుందట. ఒత్తిడి తగ్గి.. ప్రశాంతంగా కలయికలో పాల్గొనడం వల్ల... శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదలౌతుంది. ఇది మనల్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేలా చేయడానికి సహాయం చేస్తుంది.