గ్రహణ సమయంలో శృంగారం... మంచిదేనా..?

చాలా మంది గ్రహణం సమయంలో ఏ పని చేయొచ్చు.. ఏ పని చేయకూడదు అనే దానిపై క్లారిటీ ఉండదు. దీంతో.. కొన్నొ పొరపాట్లు చేస్తుంటారు. అందులో గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొనడం.

Solar Eclipse on June 21, 2020: Can one have sex during a solar eclipse?

గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ గ్రహణాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగ్రహణం రెండుసార్లు రాగా.. నేడు అతి పెద్ద సూర్య గ్రహణం ఏర్పడనుంది.

జూన్ 21వ తేదీన అతి పెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం. జ్యోతిషశాస్త్రం ప్రకారం కరోనా వైరస్ గతేడాది డిసెంబరులో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే ప్రారంభమైంది. మరి ఈ ఏడాది ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణంతో కరోనా ప్రభావం ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉండగా..చాలా మంది గ్రహణం సమయంలో ఏ పని చేయొచ్చు.. ఏ పని చేయకూడదు అనే దానిపై క్లారిటీ ఉండదు. దీంతో.. కొన్నొ పొరపాట్లు చేస్తుంటారు. అందులో గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొనడం.

గ్రహణం ఏర్పడిన సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఆ టైంలో శారీరక కలయికకు దూరంగా ఉండాలని జోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం టైంలో శృంగారానికి దూరంగా ఉండాలి. ఆ టైంలో బిడ్డ కడుపులో పడటం మహిళలకు మంచిది కాదు. పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మూఢనమ్మకంగా భావించి ఆ టైంలో కలయిలో పాల్గొన్నా.. గర్భం దాల్చకుండా జాగ్రత్త వహించాలి.

ఇక గర్బిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లకుండా తగిన విశ్రాంతి తీసుకోవాలి. దేవుడి విగ్రహాలు తాకొద్దు.గ్రహణం వీడాక స్నానం చేయాలి.
మంత్రోచ్ఛారణ ప్రయోజం కలిగిస్తుంది.దానధర్మాలు చేయడం మంచిది.

కాగా.. భారత్ లో ఈ గ్రహణం ఎప్పుడు కనపడనుందో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా ఈ సూర్యగ్రహణాన్ని అందరూ వీక్షించవచ్చు. భారత్ లోనూ కొన్ని ప్రదేశాల్లో ఈ గ్రహణాన్ని చూడవచ్చు. ఇది వార్షిక గ్రహణంగా మారనుంది. చంద్రుడు నీడ సూర్యుడిని దాదాపు 99 శాతం కప్పనున్నాడు. ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది.

సూర్యగ్రహణం జూన్ 21న 10.31 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుంది. పూర్తి ప్రబావం మధ్యాహ్నం 12.18 గంటలకు కనిపించనుంది. దాదాపు 3 గంటల 33 నిమిషాలకు పూర్తి గ్రహణం ఏర్పడనుంది. 

తెలంగాణ రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం  10:14
గ్రహణ మధ్యకాలం : ఉదయం 11: 55 
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 44 
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.

ఆంధ్ర రాష్ట్రానికి
గ్రహణ ఆరంభకాలం : ఉదయం 10: 23 
గ్రహణ మధ్యకాలం : మధ్యహ్నం 12: 05
గ్రహణ అంత్యకాలం : మధ్యహ్నం 1: 51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
గ్రహణ నియమాలు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios