మహిళలు శృంగారం పట్ల అయిష్టత చూపడానికి కారణం ఇదే..!

మహిళలు కలయికకు నో చెప్పడానికి... శారీరక, మానసిక కారణాలు చాలానే ఉంటాయి. అందులో పురుషుల ప్రవర్తన కూడా ఒక ప్రధాన కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 
 

reasons why women avoid having sex

పెళ్లైన కొత్తలో శృంగారం పట్ల ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ... పోను పోను ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. పురుషులతో పోలిస్తే....మహిళల్లో ఈ కోరిక ఎక్కువగా తగ్గిపోతుందట. అలా వారు ఆసక్తి కోల్పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయట. అవేంటో ఓసారి చూద్దాం...


సెక్స్ చేయాలనే మీ భావన లేదా కోరిక మీ భాగస్వామికి కలగకపోపవచ్చు. మీరు కోరుకున్నప్పుడు మీ భాగస్వామి సమ్మతించకపోతే... మీకు అసంతృప్తిగా ఉంటుంది. మీరు కోరిన సమయంలో ఆమెకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అది కాక.. మహిళలు కలయికకు నో చెప్పడానికి... శారీరక, మానసిక కారణాలు చాలానే ఉంటాయి. అందులో పురుషుల ప్రవర్తన కూడా ఒక ప్రధాన కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

ఒత్తిడి

తక్కువ లిబిడోకు ఒత్తిడి ఒక ముఖ్యమైన కారణం. మానసికంగా ఆనందంగా లేనివారిలో లిబిడో తక్కువగా ఉంటుంది. వారు కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు. కలయికలో పాల్గొనాలనే కోరిక కూడా ఉండకపోవచ్చు. ఇంట్లో పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో కూడా వారికి కలయికలో పాల్గొనాలో ఉత్సాహం రాకపోవచ్చు. అలా కాకుండా... మీరు వారిని ఏదైనా మంచి ప్రదేశానికి, విహార యాత్రకు తీసుకువెళితే... అప్పుడు ఒత్తిడి తగ్గి... కలయికలో పాల్గొనాలనే కోరిక పెరిగే అవకాశం ఉంటుంది. 

బ్యాడ్ సెక్స్...

కొన్ని సందర్భాల్లో పురుషుడు ప్రదర్శన సరిగాలేనప్పుడు.... ముగింపులో లైంగిక సంతృప్తి లేనప్పుడు, మహిళలు ఆసక్తిని కోల్పోతారు. ఇది చాలా సాధారణ సమస్య. కానీ.. చాలా మంది పురుషులు తమలో ఈ సమస్యను అంగీకరించలేరు.

నొప్పి

సెక్స్ సమయంలో శారీరక నొప్పి కూడా వారికి కలయిక పట్ల అయిష్టత పెరుగుతుంది.  బాధాకరమైన సెక్స్  కొన్ని సాధారణ కారణాలలో పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఇది పెల్విస్ బేస్‌లోని కండరాలు విశ్రాంతి తీసుకోనప్పుడు జరుగుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు జరిగినప్పుడు కూడా కలయిక నొప్పిగా ఉంటుంది.


మానసిక కారణాలు

చాలా ఆందోళన లేదా నిరాశ ఉన్నప్పుడు, మీ సెక్స్ డ్రైవ్‌పై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రిలేషన్ షిప్ లో సమస్యలు తరచుగా ఈ ప్రవర్తన వెనుక కారణంగా మారతాయి.. గతంలో కలయికలో పాల్గొన్న సమయంలో లైంగికంగా గాయం జరిగినా... అది తర్వాత ప్రభావం చూపించే అవకాశం ఉంది.

 చెడు వాసన

చెడు వాసన కలిగి ఉండటం ఎవరినైనా దూరం చేస్తుంది. అందులో స్త్రీలు కూడా ఉంటారు. మీకు చెమట ఎక్కువగా ఉంటే లేదా నోటి దుర్వాసన ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా.. దుర్వాసన కారణంగా దూరం పెట్టే అవకాశం ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios