నగ్నంగా పోర్న్ స్టార్స్ ఇంటికి నడిచి వచ్చి...
ప్రస్తుతం రోజుల్లో పిల్లలకు సైతం పెద్దలు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ ఫోన్ లలో వాళ్లు ఏం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లల కంట పోర్న్ సినిమాలు పడుతున్నాయని తెలిసింది.
పోర్న్ సినిమాలు వీక్షించే యువతీ యువకులు చాలా మందే ఉండి ఉండొచ్చు. అరచేతిలో స్మార్ట్ ఫోన్.. అతి తక్కువ ధరకే మొబైల్ డేటా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో.. ఎవరికి నచ్చినవి వారు చూసేస్తున్నారు.
ఎక్కువ మంది పోర్న్ చిత్రాలు చూస్తున్నారనీ... మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో అందరికీ అదే పని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటూ ఇటీవల ఓ సర్వేలో కూడా తేలింది.
ఓ వయసు వారు పోర్న్ చూశారు అంటే.. ఒకే కాస్త పర్లేదు. కానీ.. తెలిసీ తెలియని వయసు పిల్లలు.. టీనేజీ వయసు పిల్లల కంటే అవి పడితే.. ప్రమాదమే.
దాని నుంచి వారు ఏమి నేర్చుకుంటారో కూడా మనం ఒక పట్టాన చెప్పలేము. అసలు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ చాలా దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. దీనిని ఎలా అరికట్టాలో అర్థంకాక ప్రభుత్వాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి.
కాగా.. ప్రస్తుతం రోజుల్లో పిల్లలకు సైతం పెద్దలు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ ఫోన్ లలో వాళ్లు ఏం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లల కంట పోర్న్ సినిమాలు పడుతున్నాయని తెలిసింది.
దీని కారణంగానే క్రైమ్ రేటు కూడా పెరుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోర్న్ స్టార్స్ సహాయంతో.. ఓ వీడియో విడుదల చేసి దానిని విడుదల చేసింది.
ఆ వీడియోలో ఓ ఇద్దరు పోర్న్ స్టార్స్ నగ్నంగా నడుచుకుంటూ ఓ ఇంటికి వెళతారు. ఆ ఇంటి మహిళ వచ్చి తలుపులు తీసి చూడగా.. ఇద్దరు పోర్న్ స్టార్స్ నగ్నంగా కపడతారు.
వాళ్లని అలా చూసి ఆమె తొలుత షాక్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే తేరుకొని మీరు ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతుంది.
దీంతో వారు.. మీ అబ్బాయి ఇంటర్నెట్ లో మా కోసం విపరీతంగా వెతుకుతున్నాడు.. అందుకే హాయ్ చెబుతామని వచ్చామని సమాధానం చెబుతారు.
వెంటనే ఆవిడ తన కుమారుడిని పిలుస్తుంది.ఆ పిల్లాడు వచ్చి వాళ్లని ఎదురుగా చూసి షాకౌతాడు. దీని అర్థం ఏమిటంటే.. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఇచ్చేటప్పుడు వాళ్లు అందులో ఏం చూస్తున్నారో కూడా ఓ కన్నేయండి అంటూ.. చెబుతూనే.. పిల్లల కంట అలాంటివి పడకుండా ఉండేందుకు ‘కీప్ ఇట్ రియల్ ఆన్ లైన్ ’ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.