పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. పెళ్లికి ముందే.. వేలల్లో.. లక్షల్లో ఖర్చు పెట్టి మరీ.. ఈ ఫోటోలు, వీడియోలు చేయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది.

ప్రతి ఒక్కరూ.. వినూత్నంగా.. ఒకరిని మించి మరోకరు చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇలానే ఓ జంట కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అయితే... అది చూసినవారంతా మామూలుగా షాకవ్వలేదు.

ఎందుకంటే.. అవి ప్రీవెడ్డింగ్ షూట్ కి ఎక్కువ.. హనీమూన్ కి తక్కువగా ఉన్నాయి. ఆ ఫోటోలు చూసినవారెవ్వరూ.. పెళ్లికి ముందు ఫోటోలు అంటే ఏమాత్రం నమ్మరు. కనీసం.. హనీమూన్ కపుల్ కూడా ఇంత దారుణంగా ఫోటోలు దిగరేమో అనేవిధంగా ఉన్నాయి.

 

అడల్ట్ కంటెంట్ తో.. వీరు ఈ ఫోటో షూట్ చేయించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లిప్ లాక్ లతో పాటు.. ఒకరి ఒడిలో మరొకరు కూర్చోడం.. ఇలా చాలానే ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్లు నోర్రెళ్ల పెడుతున్నారు. 

ఇలా కూడా పెళ్లికి ముందు ఫోటీలు దిగుతారా అంటూ షాకౌతున్నారు. ఏది ఏమైనా.. ఈ జంట ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇక.. మీమర్స్, ట్రోలర్స్ కి అయితే.. వీళ్ల ఫోటోలు మంచి స్టఫ్ గా మారాయి. వాళ్లకి నచ్చిన విధంగా మీమ్స్ కి వీరి ఫోటోలను వాడేసుకుంటున్నారు.

ఈ జంట కోరుకుంది కూడా ఇదే కాబోలు. తాము సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా దిగారు కాబోలు. వాళ్లు అనుకున్న విధంగానే ఫేమస్ అయిపోయారు. కావాలంటే వారి ఫోటోలను మీరు కూడా ఇక్కడ చూసేయొచ్చు.