Asianet News TeluguAsianet News Telugu

ఇండియా పర్యటన: ఎన్నికల స్టంటే, తేల్చేసిన ట్రంప్!

అసలు ఏ ఉద్దేశంతో ట్రంప్ భారత్ వచ్చాడో అనే విషయం ఇందాక కొద్దిసేపటి కింద మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ ఈవెంట్ లో మాట్లాడిన ట్రంప్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 

Trump India Visit: A pure election stunt... Namaste trump tells all about that
Author
Ahmedabad, First Published Feb 24, 2020, 6:52 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి ఉదయం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుండి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి నేరుగా నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొనేందుకు మొతేరా క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు. 

ట్రంప్ పర్యటన ప్రారంభానికి ముందు నుండే... అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో లేకుండా, ట్రేడ్ సెక్రటరీ లేకుండా వస్తున్నాడంటేనే అంత పెద్ద వాణిజ్య ఒప్పందాలు ఉండబోవని తేటతెల్లమైంది. 

మరి అసలు ఏ ఉద్దేశంతో ట్రంప్ భారత్ వచ్చాడో అనే విషయం ఇందాక కొద్దిసేపటి కింద మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ ఈవెంట్ లో మాట్లాడిన ట్రంప్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 

Also read: ట్రంప్ ఉచ్ఛారణలో తప్పులు: ఆడుకుంటున్న నెటిజన్లు

ట్రంప్ మాటలను అర్థం చేసుకునే ముందు... మనకు ట్రంప్ గురించి కొన్ని బేసిక్ లక్షణాలు తెలియాలి. అవి తెలిస్తే... ట్రంప్ మాటలను వాటిని సరిపోల్చి చూసుకున్నప్పుడు మనకు అసలు సినిమా అర్థమవుతుంది. 

సాధారణంగా ట్రంప్ కి ప్రయాణాలంటే పడవు. ఆయన ప్రయాణం చేయడానికి అయిష్టతను ప్రదర్శిస్తారు. ఒబామా హయాంలో ఆయన ఎన్నికైన నాలుగు సంవత్సరాల్లో 31 విదేశీ పర్యటనల్లో పాల్గొంటే... ట్రంప్ ఇప్పటివరకు కేవలం 18 పర్యటనల్లో మాత్రమే పాల్గొన్నారు. 

ఇలా పర్యటనలంటేనే పడనీ ట్రంప్ దాదాపుగా 8 వేల మైళ్ళు 20 గంటల పాటు ప్రయాణించి చేరుకోవడం నిజంగా ట్రంప్ భారత్ కి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ట్రంప్ ఒక్కడే కాకుండా ఆయన తన భార్యతో పాటు కుటుంబంతో వచ్చాడు. 

ట్రంప్ ఇలా భార్యతోసహా కలిసి కేవలం జపాన్ లో మాత్రమే పర్యటించారు. ఇప్పుడు భారత్ లో పర్యటిస్తున్నారు. మరో విషయమేమిటంటే... సాధారణంగా ఇలా ఎన్నికలకు ఒక 8 నెలల ముందు ఏ అమెరికా అధ్యక్షుడయినా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ట్రంప్ ఇలా భారత్ లో పర్యటిస్తున్నారు. 

ఈ సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్న ట్రంప్ ఇవాల్టి నమస్తే ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ నుంచి మొదలుకొని క్రికెట్ వరకు అనేక అంశాలపై మాట్లాడాడు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి... ముఖ్యంగా మోడీ గురించి, మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ గురించి మాట్లాడారు. 

Also read; ట్రంప్ తాజ్ పర్యటన: ఆ ప్రేమ చిహ్నం గురించి వివరిస్తున్న ఆ గైడ్ ఎంపిక ఎలా జరిగిందంటే...

దాన్ని బట్టి చూస్తుంటే... ట్రంప్ అమెరికాలో ఉన్న భారతీయ ఓటర్లను, అందునా ముఖ్యంగా అమెరికాలోని 4 మిలియన్ల హిందూ ఓటర్లను నేరుగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతుంది. గత ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అమెరికన్లంతా డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కి వోట్ వేశారు. 

ఈ నేపథ్యంలో ఆ వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు. గత సెప్టెంబర్ లో మోడీ కూడా హౌడీ మోడీ ఈవెంట్లో సైతం మోడీ అబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. 

ఇవాళ సైతం అమెరికాలో ఉన్న భారతీయుల పరువు కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటే... మరింతగా పెరుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇలా ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని చాలా తెలివిగా చేసుకున్నారు. ఒక రకంగా మోడీ అభిమానులందరినీ తనవైపుగా తిప్పుకునే ప్రయత్నం చేసారు ట్రంప్. 

ఒక రకంగా పర్ఫెక్ట్ గా చాలా డిప్లొమాటిక్ గా రాసిన స్పీచ్ అది. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ.... ట్రంప్ ఒకటికి రెండుసార్లు భారత భిన్నత్వం గురించి మాట్లాడాడు. అంతే తప్ప నేరుగా అందరూ అనుకున్నట్టు పౌరసత్వ సవరణ చట్టం గురించి మాత్రం మాట్లాడలేదు. 

అలా భిన్నత్వాన్ని ప్రస్తావించడానికి కూడా కారణం లేకపోలేదు. ఆయన తన దేశంలో భారతీయ పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనార్టీల హక్కులను హరించి వేస్తుందని గొడవ చేస్తున్న క్రిస్టియన్ మత ప్రవక్తలకు నేను మాట్లాడాను అని చూపెట్టడం ఒక ముఖ్య కారణం. 

ట్రంప్ మద్దతుదారుల్లో ఈ క్రిస్టియన్ మతప్రవక్తలు అత్యధికమంది ఈ విషయం పై గగ్గోలు పెడుతున్నారు. అందుకోసమని ఇలా ఒక రెండు మాటలు మాట్లాడి మాట్లాడనట్టునా మాట్లాడారు ట్రంప్. 

మొత్తానికి ట్రంప్ స్పీచ్ ను బట్టి చూస్తుంటే... తన ఎన్నికల ప్రచారాన్ని తెలివిగా నిర్వహించదనడంలో నో డౌట్! దానితోపాటుగా ఈ పర్యటన పెరుగుతున్న భారత్ అమెరికాల మైత్రికి చిహ్నంగా కూడా చెప్పవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios