Asianet News TeluguAsianet News Telugu

ఈ ఐపిఎల్ సీజన్ గ్రేటెస్ట్ ఎలెవన్ ఎవరంటే..: గత జాబితా ఇదే

ఈ ఐపీఎల్ సీజన్ నిన్న స్టార్ట్ అవ్వాల్సి ఉన్న సందర్భంగా, వాయిదా పడింది కాబట్టి ఒక్కసారి గత 12 సీజన్లలో అత్యుత్తుమ ఆటతీరును కనబరిచి ఐపీఎల్ అల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో చోటు సంపాదించుకుంది ఎవరో ఒకసారి చూద్దాం. 

Know the greatest eleven of IPL till date in the wake of Corona Postponed league
Author
Hyderabad, First Published Mar 30, 2020, 8:38 PM IST

మార్చి 29, 2020, ఆదివారం. ఈ రోజు కోసం సంవత్సరం నుండి క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో వేలం పూర్తయిన దగ్గరి నుండి క్రికె పండితులు అత్యుత్తమ జట్టు ఏది అంటూ లెక్కలు కడుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లు సందులో సడేమియా లాగ అందినంత దోచుకోవడానికి కూడా ప్లన్స్ వేసుకున్నారు. 

ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నామని కదా.,.! అదే నంది ఐపీఎల్ సీజన్ గురించి. వాస్తవానికి నిన్న ఐపీఎల్ ఆరంభమవ్వాల్సింది. ఈ మార్చ్ 29 కోసం అందరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయి ఉన్నారు.  

ముంబయి వాంఖడే మైదానంలో  డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, గత సీజన్ ఫైనలిస్ట్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌లు వరుసగా రెండో సీజన్‌లో కూడా ఓపెనింగ్ మ్యాచ్‌లోనే  తలపడాలి.

ఐపీఎల్ సీజన్ అంటేనే అభిమానుల అంచనాలకు హద్దులు ఉండవు. బాలీవుడ్‌ తారల సందడితో ఈ ఆదివారం ఐపీఎల్‌ ప్రారంభమయి ఉండేది. స్పోర్ట్స్ ఛానల్, ఈ ఛానల్, ఆ ఛానల్, న్యూస్ ఛానల్ అన్న తేడా లేకుండా ఈ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ చేసేవారు. 

కానీ కరోనా రక్కసి ఈ సీజన్ ఐపీఎల్ భవిష్యత్తుపై కాటువేసేదిలా ఉంది. దాదాపుగా వేసేసినట్టే. ప్రస్తుతానికి ఏప్రిల్‌ 15కు వాయిదా పడినా, ఆ తర్వాత సైతం ఐపీఎల్‌ 13 ఆరంభమయ్యే ఛాన్స్ మాత్రం లేదు.  

కరోనా వైరస్‌ మహమ్మారి క్రీడా రంగాన్ని చావు దెబ్బ కొట్టినా, ఐపీఎల్‌13 వాయిదా పడినా.. అభిమానుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29న నిన్న ఆరంభం కావాలి. కానీ కరోనా రక్కసి ఈ ఐపీఎల్ సీజన్ ని పూర్తిగా మింగేసేదిలానే కనబడుతుంది. 

ఈ ఐపీఎల్ సీజన్ నిన్న స్టార్ట్ అవ్వాల్సి ఉన్న సందర్భంగా, వాయిదా పడింది కాబట్టి ఒక్కసారి గత 12 సీజన్లలో అత్యుత్తుమ ఆటతీరును కనబరిచి ఐపీఎల్ అల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో చోటు సంపాదించుకుంది ఎవరో ఒకసారి చూద్దాం. 

1. క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌) : 

యూనివర్స్ బాస్ అని గేల్ ని ఎందుకు అంటారో వేరుగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ లో క్రిస్‌ గేల్‌ సూపర్‌స్టార్‌. తాజా ఐపీఎల్‌ వేలంలలో గేల్‌ ను కొనేందుకు ప్రాంఛైజీలు విముఖత చూపుతున్నా, అతడు జట్టులో ఉంటే ఆ రేంజ్ యే వేరు. 

ఐపీఎల్‌లో అత్యధికంగా ఆరు సెంచరీలు బాదేశాడు గేల్‌. ఐపీఎల్‌లోనే కాదు టీ20 ఫార్మాట్‌లోనే వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగుల రికార్డు గేల్ పేరు మీదనే ఉంది. ఓపెనర్ గా గేల్‌ 4,480 పరుగులు చేశాడు. అత్యధికంగా 326 సిక్సర్లు బాదాడు. 

మొత్తం పన్నెండు సీజన్లలో ఏకంగా మూడు సీజన్లలో 600 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇక రెండు సీజన్లలోనయితే... ఏకంగా 700 ప్లస్‌ పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 22 శతకాలు, 82 అర్థ సెంచరీలు బాదిన రికార్డు గేల్ సొంతం. టీ20ల్లో 978 సిక్సర్లు, 1026 ఫోర్లతో క్రిస్‌ గేల్‌ ఐపీఎల్ గ్రేటెస్ట్ ఎలెవన్ లో ఖచ్చితంగా ఉండి తీరుతాడు. 

2. డేవిడ్ వార్నర్‌ (ఆస్ట్రేలియా) : 

తెలుగు ప్రజలకు సన్ రైజర్స్ పుణ్యమాని   4706 పరుగులతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాల్గో స్థానం. విదేశీ ఆటగాళ్లలోనయితే వార్నర్‌దే అగ్రస్థానం. ఐపీఎల్‌ లో అత్యధికంగా 48 అర్ధ సెంచరీలు సాధించాడు. 

ఐపీఎల్‌లో ఐదుసార్లు 90 ప్లస్‌ స్కోర్లు నమోదు చేశాడు. 30 ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలను సాధించాడు. వాటిని కూడా భయంకరామైన 150 పైచిలుకు స్ట్రయిక్‌రేట్‌తో సాధించడం విశేషం. 

విరాట్‌ కోహ్లితో సమానంగా ఐపీఎల్‌లో ఐదు సీజన్లలో 500 ప్లస్‌ పరుగులు రాబట్టిన ఏకైక బ్యాట్స్ మెన్. మూడు సీజన్లలో వార్నర్‌ 600 పైచిలుకు పరుగులు కొట్టి క్రిస్ గేల్ రికార్డును సమం చేసాడు. 

3. విరాట్‌ కోహ్లి (భారత్‌) : 

రన్ మెషిన్. ఐపీఎల్ లెక్కలు చూస్తే ఇతనికి ఆ పారేందుకు పెట్టారో ఇట్టే అర్థమయిపోతుంది. 5412 పరుగులతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. 

ఒక్క 2016 సీజన్‌లోనే విరాట్‌ కోహ్లి 973 పరుగులు చేశాడు. ఓ సీజన్‌లో 900 ప్లస్‌ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఆ సంవత్సరం ఆర్సీబీకి కప్పును గెలిపించినంత పనిచేసాడు. 

ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు కోహ్లిదే.  2016 సీజన్‌లో 11 అర్ధ సెంచరీలతో మరో రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. 

4. సురేష్‌ రైనా (భారత్‌) : 

5368 పరుగులతో ఐపీఎల్‌ పరుగుల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానం. 12 ఐపీఎల్‌ సీజన్లలో 9 సీజన్లలో రైనా 400 ప్లస్‌ పరుగులు చేశాడు. అత్యధికంగా 193 ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడాడు. రైనా కేవలం బ్యాటింగ్ రికార్డునే కాదు ఫీల్డర్ గాను ఇతని రికార్డు అమోఘం.  

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఫీల్డర్ సాధించని శతక రికార్డును సొంతం చేసుకున్నాడు. 102 క్యాచులు పట్టిన ఏకైక ఫీల్డర్‌గా ఐపీఎల్ చరిత్రపుటల్లోకెక్కాడు. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌లో సురేష్‌ రైనా కనీసం 350 పరుగులు చేశాడు. 

ఇక ఇతడు బౌలింగ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. టీం కి అవసరం వచ్చినప్పుడు బంతితో కూడా తన సేవలను అందించాడు. బౌలర్‌గా 7.39 ఎకానమీతో 25 వికెట్లు సైతం రైనా ఖాతాలో ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా సురేష్‌ రైనా నిలుస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.  

5. ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా) : 

మిస్టర్ 360. విలక్షణమైన ఆటతీరుతో ప్రపంచమంతా ఇతగాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. డివిలియర్స్‌ 151.24 స్ట్రయిక్‌రేట్‌తో ఐపీఎల్‌లో 3000 ప్లస్‌ పరుగులు చేశాడు. ఈ స్ట్రయిక్‌రేట్‌తో ఇలా టన్నులకొద్దీ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరు లేరు. 

వికెట్ కీపింగ్ లో కూడా ప్రావీణ్యమున్న  డివిలియర్స్ అవసరమైన సమయంలో వికెట్ల వెనకాల గ్లౌవ్స్‌తోనూ కొత్త అవతారం ఎత్తడానికి సదా సిద్ధంగా ఉంటాడు. 

6. ఎం.ఎస్‌ ధోని (భారత్‌) (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌) : 

ఈ మధ్య కాలంలో ధోని భవితవ్యంపై అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ధోని రిటైర్మెంట్ ఎప్పుడని ప్రశ్న అందరి మనసుల్లోనూ ఉద్భవిస్తూనే ఉంటుంది. కానీ ఐపీఎల్ లో మాత్రం ధోనిని మించిన కెప్టెన్ వేరొకరు ఉండరు. 

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. 174 మ్యాచుల్లో జట్టుకు నాయకత్వం వహించిన దీని, 104 విజయాలు సాధించాడు.  100 పైచిలుకు విజయాలు సాధించిన ఏకైన నాయకుడు ధోని. ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ యావరేజ్ 42.20. ఐపీఎల్‌లో ఇది సెకండ్ బెస్ట్. 

7. హర్బజన్‌ సింగ్‌ (భారత్‌) : 

ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన ఆఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌. 7.05 ఎకానమితో 100 వికెట్లు కూల్చిన బౌలర్లలో భజ్జీ మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపించడంలో హర్భజన్ దిట్ట. 138 స్ట్రయిక్‌ రేట్‌తో చాలా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లను కూడా ఆడాడు భజ్జి. 

8. భువనేశ్వర్‌ కుమార్‌ (భారత్‌) : 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంత బలంగా కనపడడానికి, మ్యాచుల్లో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా కనిపించడంలో బౌలర్లది చాలా కీలక పాత్ర. ఆ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తూ... కొన్ని సార్లు జట్టుకు కూడా నాయకత్వం వహించాడు భువి. 

భువి ఖాతాలో 133 వికెట్లు ఉన్నాయి.  7.24 ఎకానమితో లసిత్‌ మలింగ తర్వాత అత్యుత్తమ ఎకానమీ కలిగింది భువినే. 100కు పైగా వికెట్లు కూల్చిన భారత పేసర్లలో భువి స్ట్రైక్ రేట్  సెకండ్ బెస్ట్.  

9. అమిత్‌ మిశ్రా (భారత్‌) : 

అమిత్‌ మిశ్రా ఐపీఎల్‌లో 157 వికెట్లు కూల్చాడు. మలింగ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మిశ్రానే!. ఇక కేవలం స్పిన్నర్లను మాత్రమే పరిగణిస్తే... స్పిన్నర్లలో మిశ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్ గా రికార్డులకెక్కాడు.  

10. లసిత్‌ మలింగ (శ్రీలంక) : 

170 వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లను నేలకూల్చిన యోధుడిగా లసిత్‌ మలింగ రికార్డులకెక్కాడు. మలింగ సరాసరిన వేసిన ప్రతి 16.63 బంతులకు ఓ వికెట్‌ ను కూల్చాడు. 

11. జహీర్‌ ఖాన్‌ (భారత్‌) : 

జహీర్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ ఎలెవన్‌లో నిలిచిన ఏకైక లెఫ్టార్మ్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌. జహీర్ ఖాన్ కెప్టెన్ గా కూడా సేవలందించారు. అతడి ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్లకు తిరుగు లేనే లేదు. వైవిధ్యతను ప్రదర్శిస్తూ బంతులేయడం ఇతగాడి సొంతం. 

Follow Us:
Download App:
  • android
  • ios