విమానంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధించిన ఇండియన్ టెక్కీకి  9ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  తమిళనాడుకి చెందిన ప్రభు రామమూర్తి(35) హెచ్1బీ వీసా మీద అమెరికా వెళ్లి.. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. 

కాగా.. అతను ఈ ఏడాది మొదట్లో లాస్ వెగాస్ నుంచి డెట్రాయిట్ విమానంలో వెళ్తుండగా.. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన పక్క సీట్లో నిద్రిస్తున్న మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతను చేస్తున్న పనికి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన మహిళకు.. తన డ్రస్ బటన్స్ తొలగించి ఉండటం గమనించింది. 

దీంతో,.. వెంటనే సదరు బాదిత మహిళ.. ఎయిర్ పోర్టులో సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ప్రభు రామమూర్తి భార్య కూడా అతని పక్కనే ఉండటం గమనార్హం. కాగా..బాధిత మహిళ.. ఈ విషయంలో న్యాయస్తానాన్ని ఆశ్రయించింది. గురువారం ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయస్థానం... ఇండియన్ టెక్కీకి  9ఏళ్ల జైలు శిక్ష విధించింది.