అమెరికాలో ఓ ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ తెలుగు టెకీ ప్రమాదానికి గురై మరణించాడు. సరదాగా విహారానికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు వాటల్ పాల్స్ లో పడి  చనిపోయాడు. 

వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇతడికి అమెరికాలోని ఓ ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. గత పదేళ్లుగా నాగార్జున అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే పని ఒత్తిడి నుండి కాస్త ఉపశమనం పొందేందుకు నాగార్జున తన సహచర మిత్రులతో కలిసి నిన్న సరదాగా నార్త్ కరోలినా ప్రాంతంలో విహారానికి వెళ్లాడు.అయితే అక్కడ ప్రమాదవశాత్తు ఇతడు జతపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

నాగార్జున మృతిపై సహచరులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొట్టిముక్కల గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.