పిజ్జా ఆర్డర్ చేసుకుంటానంటే వద్దన్నదని ఓ కుమారుడు కన్న తల్లినే దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..   భారత సంతతికి చెందిన నళిని(51).. భర్త, కుమారుడితో అమెరికాలోని నార్త్‌ కరోలోనా రాష్ట్రంలో స్థిరపడ్డారు. కాగా.. నళిని కుమారుడు ఆర్నవ్.. సరదాలకు, చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నాడు.

గమనించిన నళిని.. ప్రతి విషయంలో కుమారుడిని కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో తల్లిపై ఆర్నవ్ పగ పెంచుకున్నాడు. కాగా.. ఒక రోజు భర్త వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆర్నవ్ ఆర్నవ్‌ పిజ్జా ఆర్డర్‌ చేస్తానని అడిగాడు. తల్లి వద్దు అని చెప్పినప్పటికీ ఆర్నవ్  ఆర్డర్ చేశాడు.
 
దీంతో తల్లి నళినికి బాగా కోపం వచ్చింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆమె ఆర్నవ్‌ చెంప చెల్లుమనిపించింది. ఇది భరించలేని ఆర్నవ్‌ అక్కడే ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ... శరీరాన్ని కారులో ఎక్కించలేక అక్కడే వదిలేశాడు. హత్య చేసినప్పుడు ఆర్నవ్‌ వయసు 16 ఏళ్లు మాత్రమే. 

దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసుకుండా వదిలేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తూ... గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా.. తానే తన తల్లిని హత్య చేసినట్లు ఆర్నవ్ అంగీకరించాడు. ఈ కేసులో ఆర్నవ్‌ ఉప్పలపాటికి 12 నుంచి 15 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.