అమెరికాలో టెక్కీ మృతికి అసలు కారణం ఇదీ...
అమెరికాలోని ఉత్తర కరోలినాలోని టెకీ గోగినేని నాగార్జున మరణంపై అక్కడి అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు.
విజయవాడ: అమెరికాలోని ఉత్తర కరోలినాలోని టెకీ గోగినేని నాగార్జున మరణంపై అక్కడి అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు. రాయిపై కూర్చొని ప్రమాదవశాత్తు జారి జలపాతంలో పడి ఆయన మరణించినట్లు మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వచ్చిన ఆయన పెద్ద రాయిపై నుంచి ప్రఖ్యాత ఎల్క్ రివార్ ఫాల్స్ అడుగుకు దూకారని, ప్రవాహ ఉధృతి వల్ల పైకి రాలేకపోయారని అసిస్టెంట్ ఫైర్ మార్షల్ పాల్ బుచానన్ వెల్లడించినట్టు అవేరీ జర్నల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది.
మృతదేహాన్ని వెలికితీయడానికి రెండుగంటలు పట్టిందని అవేరీ కౌంటీ షరీఫ్ కెవిన్ ఫ్రే తెలిపారు. ఈ వాటర్‌ఫాల్స్‌లో ఆరు వారాల్లో సంభవించిన రెండో మరణం ఇది. మే 20న థోమస్ మెక్ కాడ్లే(26) కూడా ఇలాగే ప్రవాహానికి మునిగి చనిపోయాడు. గోగినేని నాగార్జున ఓ టీడీపి నాయకుడి కుమారుడు.
ఇది చాలా ప్రమాదకర ప్రాంతం. గతంలో అనేకమంది ఇక్కడ మునిగి చనిపోయిన, తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి.