మైనర్ బాలికను వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్ కి చెందిన మిహిర్ అగర్వాల్(26) అనే యువకుడు ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాడు. కాగా.. అక్కడ తన ఇంటిపక్కన ఉండే మైనర్ బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది.

తరచూ ఆమెతో ఛాటింగ్ చేసేవాడు.  ఈ క్రమంలో బాలికతో పరిచయంతో మరింత ఎక్కువగా పెరగడంతో... ఆమెతో మరింత చనువగా తిరగడం మొదలుపెట్టాడు.  ఈ నేపథ్యంలోనే తనకు న్యూడ్ వీడియోలు పంపాలంటూ బాలికను అడగడం మొదలుపెట్టాడు.

అప్పటి వరకు ప్రేమగా మెలిగిన వ్యక్తి సడెన్ గా ఇలా వీడియోలు కావాలని అడగడంతో బాలిక షాకయ్యింది. దీంతో.. ఈ విషయాన్ని వెంటనే ఆమె తన పేరెంట్స్ కి తెలియజేసింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో..స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.తరువాత అతడి మొబైల్ తీసుకుని బాలికతో చేసిన అసభ్యకరమైన చాటింగ్ గుర్తించారు.బాలిక ఇచ్చిన ఫిర్యాదు, చాటింగ్ సాక్ష్యాలని కోర్టులో అప్పగించారు.

తన నేరానికి యువకుడు అంగీకరించడంతో పోలీస్ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం తీర్పుని మే 20 కి వాయిదా వేసింది.దాంతో యువకుడు కుటుంభ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.