మీ పిల్లల్ని చంపేస్తా: అమెరికా ఎఫ్‌సీసీ ఛీఫ్‌కు వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారులో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఓ సీనియర్ అధికారికి బెదిరింపులు వచ్చాయి.

FBI arrests man who threatened to kill FCC chair Ajit Pai’s children

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారులో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఓ సీనియర్ అధికారికి బెదిరింపులు వచ్చాయి. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఛీఫ్ అజిత్ పాయ్‌కు నెట్ న్యూట్రాలిటీ విషయంలో బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. 'నీ పిల్లల్ని చంపేస్తా'నంటూ ఓ వ్యక్తి అజిత్ పాయ్‌కు బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడు.

అజిత్ పాయ్‌కు బెదిరింపు ఈమెయిల్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, అతడిని కాలిఫోర్నియాకు చెందిన 'మార్కారా మ్యాన్'గా గుర్తించామని అమెరికన్ పోలీసులు తెలిపారు. నెట్ న్యూట్రాలిటీ (తటస్థ ఇంటర్నెట్ సేవలు) ఇంటర్‌నెట్‌ సేవల ధరలు పెరుగుతాయనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, దానికి బాధ్యుడు అజిత్‌ పాయ్‌ అని మార్కారా ఆరోపించాడు.

నెట్ న్యూట్రాలిటీ రద్దు విషయంలో ప్రతికార చర్యగా తన పిల్లలను చంపేస్తానంటూ మార్కారా ఓ ఈ మెయిల్ ద్వారా అజిత్‌ను బెదిరించాడు. ఇప్పటి వరకు ఇంటర్‌నెట్‌ సేవలపై తటస్థంగా (నెట్‌ న్యూట్రాలిటీ) వ్యహరించిన ఎఫ్‌సీసీ ఆ విధానానికి గత జూన్‌లో స్వస్తి పలికింది. ఎఫ్‌సీసీ ప్రతిపాదన మేరకు నెట్‌ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా కాంగ్రెస్‌ తీర్మానం చేసింది.

నెట్ న్యూట్రాలిటీ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. నెట్‌ న్యూట్రాలిటీని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవల ధరలు పెరిగి, ఆ భారం కాస్తం వినియోగదారులపైనే పడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు గతంలో ప్రజల్ని రెచ్చగొడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, మార్కారా మాత్రం కేవలం ఎఫ్‌సీసీ చీఫ్‌ అజిత్‌ పాయ్ నిర్ణయం వల్లనే నెట్‌ న్యూట్రాలిటీ విధానం రద్దయిందనీ, అందుకు ప్రతీకారంగా తనపై పగ తీర్చుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం మార్కారా జెలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios