Asianet News TeluguAsianet News Telugu

యుఎస్‌లో భారతీయ విద్యార్ధుల అరెస్ట్.. ఆందోళనలో తల్లిదండ్రులు

ఇమ్మిగ్రేషన్  అవకతకలకు పాల్పడి  అమెరికాలోని ఓ నకిలి  విశ్వవిద్యాలయంలో ప్రవేశపోందిన 90 మంది విదేశీ విద్యార్థులను యుఎస్ ఫెడరల్ లా
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్ధులే

90 More Students, Mostly From India, Arrested From Fake US University
Author
Hyderabad, First Published Nov 28, 2019, 1:27 PM IST

ఇమ్మిగ్రేషన్  అవకతకలకు పాల్పడి  అమెరికాలోని ఓ నకిలి  విశ్వవిద్యాలయంలో ప్రవేశపోందిన 90 మంది విదేశీ విద్యార్థులను యుఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్ధులే అని తెలుస్తుంది. 

ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలకు పాల్పడ్డా 250  మందికి పైగా విద్యార్థులను  పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ డెట్రాయిట్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో చట్ట విరుద్దంగా  ప్రవేశం పోందరాని అధికారులు తెలిపారు. ఈ నకిలి యూనివర్శిటీని గత కొద్ది  రోజుల క్రితం మూసివేసినట్లు వివరించారు.

ఈ ఏడాది మార్చిలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అధికారులు నిబంధనాల ఉల్లఘించిన 161 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో దాదాపు 600 మంది విద్యార్ధుల ఆ యునివర్సీటిలో చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 

తాజాగా మరో 90 విద్యార్ధులను  అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.  ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌ను ఉల్లఘించి ఆ సంస్ధలో ప్రవేశం పొందిన 250 మంది విద్యార్ధులను అరెస్ట్ చేసినట్లుగా ఎన్‌పోర్స్‌మెంట్ అధికారి  వెల్లడించినట్లు తెలిపింది. అరెస్టైనా వారిలో 80 శాతం విద్యార్థులను తక్షణమే యుఎస్ నుంచి  వెళ్ళాల్సిందిగా ఆదేశించామని  తెలిపారు. 

మిగిలిన 20 శాతం మందిలో  కొంత మందిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే నిర్ణయించమని  మిగితా వారి విషయంలో విచారణ పూర్తైన తర్వాత చర్యలు తీసుకుంటామని  వివరించారు. నకిలీ విశ్వవిద్యాలయం అని తెలిసినప్పటికి విద్యార్ధులు అందులో చేరారని ఇది చట్ట విరుద్దమైనదైని  అమెరికాను ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ  దుమారాన్ని రేపుతుంది. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి సెనేటర్ ఎలిజబెత్ వారెన్  ఈ విషయంపై స్పందించారు. అధికారుల చర్యలను తప్పుబట్టారు. ఈ చర్య "క్రూరమైనది" అని అభివర్ణించారు.

"అధికారులు విద్యార్దుల పట్ల అనుసరిస్తున్న విధానం సరియైనది కాదు వారి చర్యలు  క్రూరమైనవి ,భయంకరమైనవి. ఆ విద్యార్థులు యుఎస్‌లో  నాణ్యమైన,ఉన్నతమైన విద్యను  అందుకోవాలని కలలు కన్నారు. అలాంటి వారిని ఉన్న ఫలంగా  దేశం నుంచి బహష్కరించడం సరియైన చర్య కాదు". అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

అలాగే ఈ కేసులో మరో ఎనిమిది మందిపై  ఐసిఇ క్రిమినల్ చార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో ఏడుగురు నేరాన్ని అంగీకరించారు. విద్యార్థులను ఆ యూనివర్సిటీలో  చేర్చడంలో వీరు వారికి సహాయపడినట్లుగా  పోలీసులు వెల్లండించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios