Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: స్టే చేసేందుకు గడువు పెంచాలి.. ట్రంప్ హెచ్‌-1బీ వీసాదారుల పిటిషన్?!

ప్ర‌పంచ దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటున్నాయి. దీని ప్ర‌భావం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇక అగ్ర‌రాజ్యం అమెరికాపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. 

"Most H-1B Workers From India...": Visa Holders' Petition Fearing Layoffs
Author
USA, First Published Apr 1, 2020, 12:03 PM IST

వాషింగ్ట‌న్: ప్ర‌పంచ దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటున్నాయి. దీని ప్ర‌భావం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్రభావం చూపనున్నది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇక అగ్ర‌రాజ్యం అమెరికాపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. 

దీంతో అమెరికాలోని పలు సంస్థ‌లు ఆర్థిక మాంద్యంతో తీవ్ర‌ ఒడిదొడుకులను ఎదుర్కోబోతున్నాయ‌ని విశ్లేష‌కులంటున్నారు. ఈ న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా కంపెనీలు రాబోయే రోజుల్లో అధిక మొత్తంలో ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్నాయ‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే అగ్ర‌రాజ్యంలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళ‌న నెలకొంది. ఇక వీరిలో అత్యధికులు భార‌త ఐటీ నిపుణులే అనే విష‌యం తెలిసిందే. 

ఒక‌వేళ ఉద్యోగాలు కోల్పోయిన త‌మ‌ను అమెరికాలోనే నివాసం ఉండేందుకు ఉన్న గ‌డువు నిబంధ‌న‌ల‌ను సవ‌రించాల‌ని హెచ్‌-1బీ వీసాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న 60 రోజుల గ‌డువును 180 రోజుల‌కు పెంచాల‌ని హెచ్1 బీ వీసాదారులు కోరుతున్నారు.

ఈ మేర‌కు వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కార్‌కు లేఖ రాసేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు 20వేల మంది సంతకాల‌ను  సేక‌రించారు. లక్ష మంది సంతకాలు చేస్తేనే అంటే వైట్ హౌస్ వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుంది. 

అంటే మ‌రో 80వేల మంది ఈ లేఖ‌పై సంతకాలు చేస్తే వైట్‌హౌజ్ దీనిని ప‌రిశీలిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతోపాటు ఐటీ రంగ అభివ్రుద్దికి విశేషంగా భారత ఐటీ నిపుణులు క్రుషి చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక అమెరికాలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా సుమారు 4.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌భావం హెచ్‌-1బీ వీసాదారులపైనే అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఓ అధ్య‌య‌నం అభిప్రాయ‌ప‌డింది. 

also read:ఇక చరిత్ర పుటలకే పరిమితం.. కనుమరుగైన ఆంధ్రా బ్యాంకు

కఠిన ఆంక్షల నేపథ్యంలో గత రెండు వారాల్లో అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీని ప్రభావం హెచ్1 బీ వీసాదారులపైనే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కొన్ని సంస్థలు ఎవరెవరి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయో ముందే సమాచారం ఇస్తున్నట్లు వినికిడి. 

ఈ క్రమంలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న వారే ముందు వరుసలో ఉన్నారని పలు కంపెనీలు ఇప్పటికే వారి ఉద్యోగులకు సంకేతాలు ఇచ్చాయి. సాధారణంగా హెచ్‌-1బీ వీసా పై వెళ్లిన వారు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం పొందక పోతే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. 

అమెరికాలో 'కొవిడ్‌-19' రోజురోజుకీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. క‌రోనా కేంద్ర స్థానంగా న్యూయార్క్ మారిపోయింది. దీంతో ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను ట్రంప్ సర్కార్ మరో నెల రోజులు పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios