పాదయాత్రకు విశ్రాంతి: ఎంపిలతో సమావేశం

First Published 26, Mar 2018, 9:59 AM IST
Ys jagan to take holiday for padayatra today
Highlights
సోమవారం శ్రీరామనవమి కావటంతో పాటు ఎంపిలతో సమావేశం నిర్వహిస్తుండటం కూడా మరో కారణం.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రకు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి ఇచ్చారు. సోమవారం శ్రీరామనవమి కావటంతో పాటు ఎంపిలతో సమావేశం నిర్వహిస్తుండటం కూడా మరో కారణం. శ్రీరామనవమి సందర్భంగా ప్రతీ ఊరులోను, ప్రతీ గ్రామంలోనూ పండుగను జనాలు భారీ ఎత్తున చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. తన పాదయాత్ర వల్ల పండగ నిర్వహణకు జనాలకు ఇబ్బందులు కలగకూడదనే పాదయాత్రకు విశ్రాంతి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

అందుకనే, పార్టీ ఎంపిలతో సమావేశం పెట్టుకున్నారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన నేపధ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై

పై చర్చిస్తారు. పార్లెమెంటు సమావేశాలు కూడా ముగింపుదశకు వస్తున్న నేపధ్యంలో తర్వాత వ్యూహాలేంటని చర్చిస్తారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్ధితులు, రాష్ట్రంలో చేపట్టాల్సిన ఆందోళనలపై కూడా చర్చ ఉంటుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ గ్రామంలో తన శిబిరంలోనే సమావేశం ఉంటుంది.

loader