చంద్రబాబుది ధర్మపోరాట దీక్షకాదు, కొంగ దీక్ష : చంద్రబాబుపై విరుచుకుపడ్డ మేకపాటి

YCP MP Mekapati Raja Mohan Reddy Fires On Chandrababu NaidU
Highlights

సీఎం పై విరుచుకుపడ్డ మేకపాటి

ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు చేపడుతున్న దీక్ష ధర్మపోరాట దీక్ష కాదని, అది కొంగ దీక్ష అని వెఎస్సార్ సిపి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ద్వజమెత్తారు. ఇవాళ విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ''వంచన వ్యతిరేఖ దీక్ష''లో పాల్గొన్న మేకపాటి ప్రభుత్వంపై, సీఎంపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోని ఆయన ఎన్నికలు దగ్గరపడేసరికి దొంగ దీక్షలకు దిగుతున్నారని మేకపాటి అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబును సీఎం చేసిన ఐదు కోట్ల ఆంధ్రులను ఆయన మోసం చేశారని మేకపాటి మండిపడ్డారు.  

ప్రత్యేక హోదా కోసం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పోరాడుతున్న పార్టీ వైసిపి పార్టీ అని మేకపాటి గుర్తు చేశారు. పార్లమెంట్ లో కూడా శక్తివంచన లేకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడి చివరకు రాజీనాబా కూడా చేశామని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వల్లే ఇంకా ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని మేకపాటి అన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌ కే ఉందన్నారు. టిడిపి ఎంపిలతో చంద్రబాబు రాజీనామా చేయించివుంటే ఖచ్చతంగా కేంద్ర దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదని మేకపాటి అన్నారు.

సీఎ: చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరు కలిసి తెలుగు ప్రజలను వంచిచారిని మేకపాటి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా నిండుసభలో ఎపికి హోదా పదేళ్లు ఇవ్వాలని జైట్లీ, వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అలా మాట్లాడిన బిజెపి ఇపుడు మాట మార్చిందని తెలియజేశారు. ఇక చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలంటూ చెప్పి రాష్ట్ర భవిష్యత్తును కాలరాశారని విమర్శించారు.  

2019 లో జరిగే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబును నమ్మి మోసపోకండని ప్రజలకు మేకపాటి సూచించారు. ఒక్కసారి జగన్‌ కు అవకాశం ఇస్తే తండ్రి కంటే మిన్నగా పరిపాలన అందిస్తారని అన్నారు. 20 మందికి తక్కువ కాకుండా ఎంపీలను వైఎస్సార్‌సీపీ ఇస్తే వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందిస్తారని పేర్కొన్నారు.

 
 

loader