Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి గ్రాఫిక్స్ ను చంద్రబాబు కాఫీ కొడుతున్నారన్న వైసిపి ఎమ్మెల్యే రోజా

వంచన వ్యతిరేక దీక్షలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా

YCP MLA Roja fires on Chandrababu Naidu

జిత్తులమారి నక్కలా వంచన చేయడంలో ఎపి సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని, నమ్మినవాళ్లను నట్టేట ముంచుతాడని అందరికి అర్థమయ్యిందని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. ఇలా రాజధాని లో నిర్మాణాలని చెప్పి బాహుబలి లో గ్రాఫిక్స్ ను కాఫీ కొట్టి ప్రజల్ని నమ్మించాలని చూశారని, వాటిని నమ్మడానికి ప్రజలేమి అమాయకులు కారని అన్నారు. ఇక ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు మరోసారి ధర్మ పోరాట దీక్ష పేరుతో దొంగ దీక్షకు  దిగారని మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలోను రాష్ట్ర ప్రజలను చంద్రబాబు వంచించిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న "వంచన వ్యతిరేక దీక్ష" రోజా ప్రభుత్వాన్ని, చంద్రబాబు ను టార్గెట్ గా చేసుకుని  మాట్లాడారు. 

కేవలం 5 గురు ఎంపీలున్న తాము పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడితే, 18 మంది ఎంపీలున్న టీడిపి కేంద్రానికి సహకరించిందని రోజా మండిపడ్డారు. హోదా కోసం పోరాడుతున్న వైసిపితో పాటు ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచొవేయడానికి ప్రత్నించిందన్నారు. అపుడు అలా చేసి ఇపుడు ఎన్నికలు దగ్గరపడగానే దీక్షల పేరుతో చంద్రబాబు హంగామా చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 1 వ తేదిన పూల్స్ డే అని అందరికి తెలుసు, కానీ ఎప్రిల్ 30 న కూడా ప్రజల్ని పూల్స్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని రోజా విరుచుకుపడ్డారు.

ఈ నాలుగేళ్లలో పోలవరం, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏం పురోగతి సాధించిందో ప్రజలకు తెలియజేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇన్నిరోజులు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరంను మేం ఆపడంలేదు, అమరావతి నిర్మాణాన్ని మేం ఆపడంలేదు. కానీ వీటికి వైసిపి పార్టీ అడ్డుపడుతోందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని రోజా తెలిపారు. 

పోరాటాలకు వైసీపీ పుట్టినిల్లని,నాడు సోనియాపై, నేడు మోడీపై రాష్ట్ర ప్రజల కోసం ఢీకొన్న మగాడు జగన్ అని రోజా అన్నారు. 2014లో చంద్రబాబుకు ఓటు వేసి నష్టపోయామని, 2019లోను ఆయనకు ఓటు వేసి నష్టపోవద్దని రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.  పోలవరం, అమరావతి పూర్తవ్వాలన్నా, హోదా రావాలన్నా.. రాయలసీమ పులిబిడ్డ జగన్‌తోనే సాధ్యమని రోజా అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios