మూడేళ్ల చిన్నారిని విసిరేసి, తల్లిపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

woman gang raped in moving car in UP
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమారుడిని బయటకు విసిరేసి వారు ఆ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈ సంఘటన సోమవారం సాయంత్రం ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై జరిగింది. చిన్నారిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం తప్పింది. 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన తర్వాత ఆమెను ముజఫర్ నగర్ జిల్లాలోని చాపర్ ప్రాంతంలో గల జాతీయ రహదారిపై వదిలేసి వెళ్లిపోయారు.

సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం మహిళను ఆస్పత్రికి పంపించినట్లు ఎస్పీ (సిటీ) ఓంబీర్ సింగ్ చెప్పారు. 

తనకు ఉద్యోగం ఇస్తానని చెప్ిప నిందితుల్లో ఒకతను ఆర్ కె మెహతా పిలిచాడని, మెహతా తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత తనకు మత్తు మందు కలిపిన ఆల్కహాల్ డ్రింక్ ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

loader