కన్న కూతురిని చంపి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తల్లి

woman allegedly killed her 4 year old daughter and later hanged herself at guntur
Highlights

గుంటూరు జిల్లాలో విషాదం

ఓ తల్లి కన్న కూతురిని చంపి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలతో ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన శ్రీనివాసరావుకు స్వప్నతో 2012లో వివాహమైంది. వీరికి కీర్తన అనే ఓ కుమార్తె ఉంది. గతంలో హైదరాబాద్ లో నివాసమున్న ఈ కుటుంబం ఈ మద్య కాలంలో గుంటూరుకి మకాం మార్చారు. వీరు ప్రస్తుతం గుంటూరు పట్టణంలోని చంద్రమౌళినగర్‌ వికాస్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు.

అయితే శ్రీనివాస రావు కు నరాల బలహీనత కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇక వీరి కూతురు కీర్తనకు కూడా ఈ మద్య కంటి పక్కన ఎముకకు చిన్న ఆఫరేషన్ జరిగింది. అయితే ఈ ఆఫరేషన్ ఫెయిలైందని, కొంత కాలం తర్వాత మళ్లీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. 

ఇలా సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్న స్వప్ర ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో భర్త లేని సమయంలో కూతురు కీర్తనను హ్యాంగర్ కుమ ఉరేసి చంపేసింది. ఆ తర్వాత పక్క గదిలో ప్యాన్ కు ఉరేసుకుని తీను కూడా చనిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

loader