సంసారానికి పనికిరాడని.. భర్తని ఏంచేసిందో తెలుసా..?

wife kills husband in yalamachili
Highlights

  • భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
  • సహజ మరణం కింద చిత్రీకరించేందుకు ప్రయత్నం

సంసారానికి పనికిరాడని.. ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం దానిని సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన ఎలమంచిలి పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎలమంచిలిలోని దిమిలి రోడ్డు ప్రాంతానికి చెందిన అతికినశెట్టి నాగేశ్వరరావు (37) కూరగాయల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి 11 ఏళ్ల క్రితం నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వీరలక్ష్మి(27) తో వివాహమైంది. అయితే మూడేళ్లగా అనారోగ్య కారణాల వల్ల నాగేశ్వరరావు దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోయాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య వీరలక్ష్మి గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన తారక ఈశ్వరరావుతో పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరికి తరచూ గొడవలు జరిగేవి. ఈ బాధలతో మనస్థాపానికి చెందిన  నాగేశ్వరరావు మద్యానికి కూడా బానిసయ్యాడు.

కాగా.. ఈనెల 7వ తేదీన నాగేశ్వరరావు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మరోసారి భార్యభర్తల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో వీరలక్ష్మి.. భర్తను బలంగా కిందకు నెట్టింది. దీంతో నాగేశ్వరరావు ముక్కుకు దెబ్బతగలి రక్తం కారుతూ స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీనిని అదునుగా చేసుకున్న వీరలక్ష్మి.. తాడుతో  భర్త గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం నిద్రలో చనిపోయాడంటూ.. కుటుంబసభ్యులకు తెలియజేసింది. మొదట సహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భార్యపై అనుమానంతో విచారణ చేపట్టగా.. తాను హత్య చేసినట్లు అంగీకరించింది.

loader