ఎవరు ఈ ఆశారాం బాపు ..?:కేసు వివరాలు ఇవీ

Who Is Asaram Bapu? Self Styled Godman To Rape Convict
Highlights

ఎవరు ఈ ఆశారాం బాపు

ఆశారాం బాపును దోషిగా తేలుస్తూ జోధ్ పూర్ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అసలు ఎవరు ఈ ఆశారాం బాపు..? అతని కేసు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఆశారాం బాపు.. 1941, ఏప్రిల్ 17వ తేదీన సింధు ప్రావినెన్స్ లోని పాకిస్థాన్ లో జన్మించారు. స్వాతంత్ర్యం అనంతరం ఆశారాం కుటుంబం.. అహ్మదాబాద్ లో స్థిరపడింది. అక్కడ ఆశారాం తండ్రి చిన్నపాటి వ్యాపారం చేసుకునేవారు.
2. ఆయన అసలు పేరు అసుమల్ హర్పలానీ. 1960 ప్రాంతంలో ఆయన లీలాషాహ్‌ను ఆధ్యాత్మిక గురువుగా చేసుకున్నారు. ఆయనే తర్వాత అసుమల్ పేరును ఆశారాంగా మార్చారు.1972లో ఆశారాం బాపు మొదటిసారిగా అహ్మదాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకున్నారు.
నాటి నుంచి ఆశారాం ఆధ్యాత్మిక ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడి నుంచి అది గుజరాత్‌లోని ఇతర నగరాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం మొదలైంది.

3. మొదట్లో గ్రామీణ ప్రాంతాలలో పేద, గిరిజన, వెనుకబడిన వర్గాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కీర్తనలతో ప్రారంభమైన ఆశారాం కార్యకలాపాలు క్రమక్రమంగా రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గానికి విస్తరించాయి.
ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ప్రసాదం పేరిట ఆయన భక్తులకు భోజనాన్ని కూడా పెట్టేవారు. దీంతో ఆయన వద్దకు వచ్చే భక్తుల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రస్తుతం ఆశారాం కి దేశవ్యాప్తంగా 4కోట్ల మంది భక్తులు ఉన్నట్లు సమాచారం.


అత్యాచారం కేసు వివరాలు...

1.2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే.

2.'పవిత్రమైన విద్య' లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. 2013, ఆగస్టు 7న బాధితురాలి తండ్రికి 16 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ వచ్చింది.

3.బాధితురాలి తల్లిదండ్రులు మరుసటిరోజు చింద్వాడా చేరుకున్నపుడు, ఆయన కుమార్తెకు దయ్యం పట్టిందని, వాటిని ఆశారాం బాపు బాగు చేస్తారని తెలిపారు. ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం ఆశారాంను కలిసేందుకు జోధ్‌పూర్‌కు వెళ్లింది.

4.ఆగస్టు 15న నమోదు చేసిన ఛార్జిషీటులో ఆశారాం 16 ఏళ్ల బాధితురాలి ఆరోగ్యాన్ని బాగు చేస్తాననే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

5.ఈ ఫిర్యాదుతో బాధితురాలి తండ్రిని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆయనను డబ్బు ఇచ్చి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా ఆ కుటుంబం ఆశారాం బాపుపై న్యాయపోరాటం చేస్తూనే ఉంది.

loader