శృంగార యాత్రలో.. పొజిషన్ చాలా ముఖ్యమండోయ్..!

What's the best sleeping position for couples?
Highlights

పొజిషన్ చాలా ముఖ్యం


మీరు మీ జీవిత భాగస్వామికి ఎటువైపు తిరిగి పడుకుంటున్నారు..? ఇదేమి ప్రశ్న అనుకుంటున్నారా..? ఈ ప్రశ్నకు సమాధామనమే మీ శృంగార జీవితం , మీ పార్టనర్ తో మీకున్న అనుబంధం తెలుస్తాయి అంటున్నారు నిపుణులు.కొందరు ఎవరివారు అన్నట్లుగా పడుకుంటారు. మరికొందరు ఎదురెదురుగా ఒకరిని మరోకరు చూస్తూ పడుకుంటారు. ఇంకొందరెమో.. భార్యను వెనక నుంచి గట్టిగా పట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే.. ఒక్కో స్లీపింగ్ పొజిషన్ కి ఒక్కో మీనింగ్ ఉంటుందంటున్నారు నిపుణులు. మరి అవేంటో  చూద్దామా...

1. ఇద్దరి వీపులు ఎదురెదురుగా ఉండి.. ఒకరిని మరోకరు టచ్ చేసి పడుకోవడం.. దీని అర్థం సెక్యురిటీ. అంటే.. భార్యభర్తలు ఇద్దరూ తమ కంఫర్ట్ కి ప్రాధాన్యత ఇస్తూనే.. జీవిత భాగ్యస్వామి స్పర్శను కూడా కోరుకుంటున్నారని అర్థం. ఇలా
పడుకునే వాళ్లు.. తమ  బంధాన్ని సెక్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా వ్యక్తిగతంగా ఇద్దరూ ఇండిపెండెంట్ గా ఉండాలని భావిస్తారు.
2.ఒకరిని మరొకరు హత్తుకొని పడుకోవడం.. దీని అర్థం.. ఒకరిపై మరొకరు ఆధారపడటం. అంటే.. పెళ్లి అయిన కొత్తలో, వారి బంధం ఏర్పడిన కొత్తలో మాత్రం ఇలా పడుకుంటారు. వీళ్లు ఒకరిపై మరొకరు ఆధారపడుతూ ఉంటారు.

3.భార్యను వెనకనుంచి హత్తుకొని భర్త పడుకోవడం.. దీని అర్థం సపోర్టింగ్. అంటే.. వ్యక్తి  తన పార్ట్ నర్ కి ఎక్కువ కంఫర్ట్ ఆఫర్ చేస్తారు. ఒకరు డామినేటింగ్ , మరొకరు సర్దుకుపోయే మనస్థత్వం కలిగి ఉంటారు.
4. ఎదురెదురుగా పడుకోవడం... దీని అర్థం కమ్యునికేషన్. ఎదురెదురుగా కపుల్స్ నిద్రకు ఉపక్రమించారు అంటే.. వారి ఇద్దరి మధ్యలో కమ్యునికేషన్ ఎక్కువ అని అర్థం. అది వెర్బల్, నాన్ వెర్బల్ గా కూడా.
5. పార్టనర్ గుండెలపై తలపెట్టి పడుకోవడం.. దీని అర్థం నమ్మకం, ప్రొటెక్షన్. ఇలా నిద్రకు ఉపక్రమించే వారిలో వారి బంధం పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ ఎదుటివారి నిర్ణయాలను గౌరవిస్తారు.
6.బోర్లా పడుకోవడం.. దీని అర్థం నమ్మకం లేకపోవడం, ఎక్కువగా బయపడటం. మీ పార్టనర్ కనుక బెడ్ మీద బోర్లా పడుకొని నిద్రపోతున్నారు అంటే.. వారికి మీద ఎక్కువగా నమ్మకం లేదు అని అర్థం. అంతేకాకుండా ప్రతిదానికీ ఎక్కువగా భయపడుతున్నారని కూడా అర్థం. మీరు ఏ విషయాలు తనతో చర్చించడం లేదని కూడా అర్థం.

loader