అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూపై ఓ యువతి వివాదాస్పద ఆరోపణలు చేసింది.  సీఎం తనపై అత్యాచారం చేశాడంటూ.. యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి సీఎం తన పై ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ సదరు యువతి పోలీసు స్టేషన్ ని ఆశ్రయించింది.

ఈ విషయంలో తనకు ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితురాలు తెలిపింది. తనపై సీఎం అత్యాచారానికి పాల్పడ్డాడు అంటే పోలీసులు నమ్మలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేమా తనపై అత్యాచారానికి పాల్పడినప్పుడు ఆయన సీఎం పదవిలో లేరని బాధితురాలు చెప్పారు . ఇప్పుడు ఆయన సీఎం అయ్యేసరికి తన మాటలు ఎవ్వరూ నమ్మడం లేదని ఆమె వాపోతున్నారు.  ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తానని తెలిపారు. తనపై పేమా అత్యాచారానికి పాల్పడినపుడే ఆ విషయంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు యువతి సమాధానం చెప్పటం లేదు