మహిళపై గ్యాంగ్ రేప్: వీడియో వైరల్, ఆత్మహత్య చేసుకుంటామని....

UP woman allegedly gang raped: Clip shared
Highlights

మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లక్నో: మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో తాము ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 

వీడియో సంఘటనపై కన్నౌజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితులను శిక్షించకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని బాధితురాలి సోదరి అంటోంది. 

నిందితులను తాలిబ్, సల్మాన్ లుగా గుర్తించారు. వారిద్దరు కూడా స్థానికులే. బావి నుంచి నీళ్లు తేవడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. పరువు పోతుందనే భయంతో మహిళ ఆ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పలేదు. 

వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదున చేశారు. ఇద్దరు నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

గత సెప్టెంబర్ లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై ఆమె మిత్రుడు, మరో ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. 

loader