కన్న కూతురినే స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన తండ్రి

First Published 19, Apr 2018, 7:08 PM IST
UP Man Allegedly Rapes 35-Year-Old Daughter, Gets Friends To Join Him
Highlights

ఉత్తర ప్రదేశ్ లో ఉన్నావా లో ఓ మైనర్ బాలికపై ఏకంగా తండ్రిలాంటి ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఏకంగా ఓ తండ్రి తన కన్న కూతురిని స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన అదే ఉత్తరప్రదేశ్ లో చోటుచుసుకుంది. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఈ సంఘటన సీతాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది.  ఈ కీచక తండ్రికి బాధితురాలు బయపడటంతో ఈ విషయం ఆలస్యంగా బైటికి వచ్చింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సీతాపూర్‌ సిటీ సమీపంలోని ఓ గ్రామనికి చెందిన వ్యక్తి వివాహితురాలై భర్తతో వేరుగా ఉంటున్న కూతురుని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లాడు. అయితే ఇంటికి వచ్చే క్రమంలో తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి మరో స్నేహితుడిని కూడా పిలిపించుకున్నారు. ఇలా తండ్రీ అతడి ముగ్గురు స్నేహితులు కలిసి యువతిని గదిలో బంధించి అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు. దాదాపు 20 గంటల పాటు ఓ గదిలో బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడడ్డారు. ఎలాగోలా ఈ కామాందుల నుండి తప్పించుకున్న యువతి నేరుగా ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయాన్ని బైటపెట్టింది. దీంతో ఆమె బాధితురాలైన తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే యువతి తండ్రి, అతడి మరో స్నేహితుడు పరారీలో ఉన్నట్లు అడిషనల్ ఎస్పీ మర్తాండ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.  
 
loader