యువతిపై రేప్ కేసు.. ఎమ్మెల్యే సోదరుడి అరెస్టు

యువతిపై రేప్ కేసు.. ఎమ్మెల్యే సోదరుడి అరెస్టు

అత్యాచార ఘటనలో మంగళవారం పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే సోదరుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
యూపీలో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ సోదరుడు అతుల్‌ సెంగార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్‌ కస్టడీలో మరణించిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సహా ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా సామూహిక అత్యాచారం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సెంగార్‌ సోదరులిద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను బీజేపీ ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం ప్రత్యర్ధుల కుట్రని అభివర్ణించారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన వెంటనే సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos