Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్టు

ఈ రోజు ఉదయాన్నే ఎమ్మెల్యేను అరెస్టు చేశారు
Unnao rape case: BJP MLA Kuldeep Singh Sengar detained by CBI

ఉన్నావ్‌కి చెందిన 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సీబీఐ అధికారులు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం  ఉదయం లక్నోలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లక్నో సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్న అధికారులు ఇప్పటివరకు మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్టు సమాచారం. కుల్దీప్ సెంగార్‌పై గురువారం ఐపీసీ 363 (కిడ్నాప్), 366 (మహిళల అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరత బెదిరింపులు) సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
 
గతేడాది జూన్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారనీ... సంవత్సరం నుంచి పోరాడుతున్నా అధికారులు తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతడి అనుచరులు బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదినట్టు ఆమె కుటుంబం పేర్కొంది. బాధితురాలి తండ్రి ఈ నెల 8న పోలీసు కస్టడీలోనే మృతి చెందడంతో మొత్తం ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.బాధితురాలు ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం చొరవతోనే కేసు ముందుకు కదిలింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios