ప్లీనరీ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

TRS Plenary Meeting At Kompally
Highlights

తమాషాలు చేస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న ప్లీనరీ ఏర్పాట్ల పై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సభలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్వాగతోపన్యాసం చేసిన బస్వరాజు సారయ్య వాయిస్ అసలు తనకు వినబడలేదని, మీకేమైనా వినబడిందా? అంటూ సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. ఏమైనా తమాషాలు చేస్తున్నారా? అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో కాస్సేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

అయితే తర్వాత కాస్త శాంతించిన కేసీఆర్ ఈ ఎసిల లను ఆపాలని, ఇంత రొద ఉంటే మనం మాట్లాడేది ఎలా వినబడుతుందని సూచించారు. ఆ తర్వాత కూడా సౌండ్ సిస్టం లో ఎకో వద్దని నార్మల్ గా పెట్టాలంటూ సీఎం సూచించారు. అసలు ఈ సౌండ్ సిస్టం నిర్వహించే వ్యక్తికి ఏమైనా తెలుసా అంటూ కాస్త ఘాటుగానే సీఎం హెచ్చరించారు.

ఇక స్వరాష్ట్రం తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని, వారి ఆనందానికి సీఎం కేసీఆర్ చలవే కారణమని స్వాగతోపన్యాసం చేసిన బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న వ్యవసాయ విధానాన్ని, అభివృద్ది కార్యక్రమాలరు ఇతర రాష్ట్రాల ప్ఱభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, ఉద్యమ నాయకుడిగానే కాకుండా సీఎం గా కూడా కేసీఆర్ సఫలమయ్యారని బస్వరాజు సారయ్య కొనియాడారు.

 

loader