అభివృద్ది నిధుల విషయంలో ఓక్క రూపాయి తేడా వఛ్చీనా రాజీనామాకు సిద్దమని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపులపై చర్చకు సిద్ధమని ,తెలుగుదేశం  వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు రావచ్చని కూడా ఆయన సవాల్ చేశారు. అభివృద్ధి నిధుల ఖర్చులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి  ఆయన నాయకుడు  జానారెడ్డి లేదా వారి నేత రాహుల్ గాంధీలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ చేశారు.