పెద్ద పెద్ద అధికార్లే నా కాళ్ల వద్ద మోకరిల్లుతారు, లొంగిపో: అమ్మాయితో ఆశారాం

Top officers bow at my feet: Asaram warns victim
Highlights

పెద్ద పెద్ద అధికారులే తన కాళ్లకు మొక్కుతారని, నువ్వెంత అంటూ తనకు లొంగిపోవాలని ఆశారాం బాపు అత్యాచార బాధితురాలిని బెదిరించనట్లు తెలుస్తోంది.

జోథ్ పూర్: పెద్ద పెద్ద అధికారులే తన కాళ్లకు మొక్కుతారని, నువ్వెంత అంటూ తనకు లొంగిపోవాలని ఆశారాం బాపు అత్యాచార బాధితురాలిని బెదిరించనట్లు తెలుస్తోంది. అత్యాచారం కేసులో ఆశారాం బాపునకు కోర్టు బుధవారం శిక్ష విధించిన విషయం తెలిసిందే.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం - చార్టెర్డ్ అకౌంటెంట్ కావాలనే కోరికను వదిలవేసి బిఎడ్ చదవాలని కూడా ఆయన ఆమెతో చెప్పాడు. బిఎడ్ చదివితే తాను గురుకులం ఉపాధ్యాయురాలిగా చేసి ఆ తర్వాత ప్రిన్సిపాల్ గా చేస్తానని హామీ ఇచ్చాడు. 

ఆమెను దుష్టశక్తులు అవరించాయని భావించి వాటిని పారదోలడానికి ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు చెందిన తల్లిదండ్రులు ఆమెను ఆశారాం వద్దకు తీసుకుని వెళ్లారు. 

విద్యార్థినిగా ఆమె మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో గల ఆశారాం నిర్వహించే వసతిగృహంలో ఉంటూ వచ్చింది.  అక్కడి వార్డెన్ శిల్పి ఆశారాంను కలవాలని ఆమెకు సలహా ఇచ్చారు. 

ఆశారాం 2013 ఆగస్టు 14వ తేదీన బాధితురాలి కుటుంబ సభ్యులను కలిశాడు. ఆ తర్వాతి రోజు బాలిక తల్లిదండ్రులను పిలిచి కొన్ని మంత్రాలు చదివిన తర్వాత వెళ్లిపోవాల్సిందిగా చెప్పాడు. 

ఆ తర్వాత 16 ఏళ్ల ఆమ్మాయిని తన గదిలోకి పిలిచి ఆమె చదువు గురించి ఆరా తీశాడు. సిఎ అయి ఏం చేస్తావని, పెద్ద అధికారులే తన కాళ్ల మోకరిల్లుతారని ఆయన అన్నాడు. తనను గదిలో గంటన్నరపాటు బంధించి తనపై దాడి చేశాడని ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో తెలిపింది. 

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆశారాం ఆమెను బెదిరించాడు. అయితే ఆమె తన తల్లికి చెప్పింది. దాంతో తల్లిదండ్రులు ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి విశ్వాసాన్ని ఆశారాం వమ్ము చేయడమే కాకుడమే కాకుండా సన్యాసుల ప్రతిష్టను దెబ్బ తీశాడని న్యాయమూర్తి మధుసూదన్ శర్మ తన తీర్పులో వ్యాఖ్యానించారు. 

loader