Asianet News TeluguAsianet News Telugu

25 మార్చి 2018 ఆదివారం మీ రాశిఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march25th your horoscope

మేషం

మేషం : ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు, భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభం

వృషభం : ఈరోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశం నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పుకానీ, టాన్స్ఫర్ కానీ ఉంటుంది.

మిథునం

మిథునం : ఈరోజు పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు.ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం

కర్కాటకం :ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆలోచించి అడుగేయండి.

సింహం

సింహం : ఈరోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అనవసర ఖర్చులుంటాయి.

కన్య

కన్య : ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు ఈరోజు ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల

తుల : ఈరోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

వృశ్చికం

వృశ్చికం : ఈరోజు మీరు రోజువారీ కార్యకమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకేరకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకరం

మకరం : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా, ఇతర వినోద కార్యకమాలకు వెళతారు. బంధువులు, మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కానీ, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురుచూస్తున్న వారికి అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీనం

మీనం : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిపాయాన్ని వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యకమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

 

Follow Us:
Download App:
  • android
  • ios