Asianet News TeluguAsianet News Telugu

24 మార్చి 2018 శనివారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇల ా ఉన్నాయి

today march24th your horoscope

మేషం

మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంటుంది. చెప్పుడు మాటలను పట్టించుకోకండి. ఆర్థికంగా అనుకూలం.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికం సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో, గృహ, భూ సంబంధ లావాదేవీలలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్ట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ పై అధికారులు , రాజకీయ నాయకులు ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావటం కానీ, అడ్డంకులు ఎదురవటం జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా, ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు, ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు , వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు. .

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంది. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పనైనా వాయిదా వేయటం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

Follow Us:
Download App:
  • android
  • ios