25 ఏప్రిల్ 2018 బుధ‌వారం మీ రాశిఫలాలు

25 ఏప్రిల్ 2018 బుధ‌వారం మీ రాశిఫలాలు

మేషం

మేషం : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

వృషభం

వృషభం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది.

సింహం

సింహం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్ర యాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

కన్య

కన్య : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీలవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

తుల

తుల : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుం ది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లా భం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది.

మకరం

మకరం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుం ది. ప్రయాణంలో అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

కుంభం

కుంభం : ఈ రోజు మీ దాంపత్య జీవితం ఆనందమయంగా ఉం టుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభకార్యక్రమంలో కానీ పాల్గొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యా పార ఒప్పందాలు ఏర్పరచుకోవడం చేస్తారు.

మీనం

మీనం :ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వాయిదా పడుతున్న పనులు ఏలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంటారు. అదే పట్టుదలతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ మాట నెగ్గుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ప్రమోషన్ లేదా బదిలీకి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos