తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డు ధరను టీటీడీ అధికారులు పెంచారు. చిన్న లడ్డూ ధర రూ.25నుంచి రూ.50కి పెంచారు. కళ్యాణం లడ్డూ ధర రూ.100నుంచి రూ.200లకు, వడ ధర రూ.100కి పెంచినట్లు ప్రకటించారు.

సాధారణ భక్తులకు ఇచ్చే లడ్డూ ధర ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించారు. సిఫార్సుల ద్వారా ప్రసాదాలు తీసుకునేవారికి మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయని అధికారులు ప్రకటించారు.