Asianet News TeluguAsianet News Telugu

మంత్రివర్గంలో మార్పులుండవు, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు: మీడియాపై మండిపడ్డ కేసీఆర్

తెలంగాణ ఏర్పాటు వల్ల దివాలా తీసింది ఆ ఇద్దరే

Telangana CM KCR  Speech At TRS Plenary Meet In Hyderabad

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన ప్లీనరీ ముగింపు సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను గుర్తు చేశారు. ప్రతి శాఖను ఆయా మంత్రులు సమర్దవంతంగా నిర్వహిస్తున్నారని వారిని కొనియాడారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తానని, వారి పనితీరు అద్భుతంగా ఉందని పొగిడారు. ఇక దేశ రాజకీయాల్లో ప్రవేశం, తదుపరి చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి వివరించిన సీఎం ప్లీనరీకి సహకరించిన వారందరికి దన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరి అనుమతి కూడా ఇప్పుడే వచ్చిందంటూ వేధిక పైనే సీఎం ప్రకటించారు. ఈ కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని 7 జిల్లాలు సస్యశ్యామలంగా మారనున్నట్లు తెలిపారు. ఇంత తొందరగా ఇంత పెద్ద ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడం కోసం కృషి చేసిన మంత్రి హరీష్ రావును, అధికారులను సీఎం పొగడ్తలతో ముంచెత్తారు. మంత్రి రాత్రనక, పగలనకు కష్టపడుతున్నారని అందుకే మంచి ఫలాలు వస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో పేద వర్గాల ఆరోగ్యం కోసం మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరుతో ప్రభుత్వం తరపున ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలా సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేసే ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకోసం వైద్య శాఖ మంత్రి కృషి చేస్తున్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోడయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశామని, వాటిని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇక వ్యవసాయానికి ఈ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్న సీఎం గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం వల్ల తెలంగాణలో దివాలా తీసింది కాంగ్రెస్ పార్టీ తో పాటు జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్ల కంపెనీలేనని చమత్కరించారు.  

వచ్చే నెల మే 10 నుంచి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు,పెట్టుబడి నగదు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.  ఈ రైతుబంధు చెక్కుల పంపిణీ తర్వాత కంటి పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

ఇక రానున్న కాలంలో తెలంగాణ రాష్టంతో పాటు దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు కేసీఆర్. చివరిగా  ప్లీనరీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios