ముంబై: రాత్రి వేళ్లలో మహిళా డ్రైవర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అత్యవసర సేవలను అందించాలని టాటా మోటార్స్‌, టీవీఎస్‌ ఆటో అసిస్ట్‌ నిర్ణయించాయి. వచ్చే నెల నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

విమెన్‌ అసిస్ట్‌ ప్రోగ్రామ్‌ కింద టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వాహనాలను నడిపించే మహిళా డ్రైవర్లకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సర్వీసులను అందించనున్నారు. 

ప్రమాదాలు జరిగినా, బ్యాటరీ పని చేయకున్నా, టైరు పంక్చర్‌ అయినా, ఇంధనం అయిపోయినా ఇతర ఏమైనా సమస్యలు ఎదురైనా వీటికి సంబంధించిన సేవలు అందించనున్నారు.