Asianet News TeluguAsianet News Telugu

భర్త సెక్స్ పిచ్చి.. భరించలేకపోతున్న భార్య

  • భారత్ లో పెరుగుతున్న మ్యారిటల్ రేప్స్
Survey Takes Veil Off Marital Rape in India

ఒక అమ్మాయిని ఎవరైనా బలాత్కరిస్తే అది రేప్. దీనిని మన దేశంలో పెద్ద నేరంగా భావిస్తారు. నేరస్థులకు శిక్షలు కూడా వేస్తారు. కానీ.. భార్యపై భర్త బలవంత శృంగారానికి ఒత్తిడి తెస్తే మాత్రం అది నేరం కాదు మన దేశంలో. ఎందుకంటే.. వారికి చట్టబద్ధంగా వివాహమైంది కాబట్టి. కానీ.. పెళ్లి కాని అమ్మాయిల కంటే.. పెళ్లి అయ్యి భర్తలచేతే చాలా మంది రేప్ కి గురౌతున్నారు. మ్యారిటల్ రేప్ గురించి ఇటీవల ఓ సంస్థ సర్వే చేపడితే.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా 83శాతం మంది వివాహితలు.. సెక్సువల్ హెరాస్ మెంట్ కి గురౌతున్నారు. ముఖ్యంగా 15ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య మహిళలు ఈ మ్యారిటల్ రేప్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఇప్పటి వరకు చాలా మంది మహిళలు తమ భర్తల సెక్స్ పిచ్చిని తట్టుకోలేకపోతున్నామంటూ పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ.. న్యాయస్థానాలు మాత్రం భార్యతో భర్త సెక్స్ చేయడం నేరం కాదనే చెప్పాయి.

Survey Takes Veil Off Marital Rape in India

కానీ ప్రతి రోజూ కనీసం ప్రతి ముగ్గురు వివాహిత మహిళల్లో ఒకరు భర్త చేత శారీరకంగా, మానసికంగా సెక్సువల్ గా హింసకు గురౌతున్నారు. అయితే.. 2005-06 సంవత్సర కాలంలో ఈ విధంగా హింసకు గురౌతున్నవారు 37శాతం ఉండగా.. 2015-16సంవత్సర కాలంలో వీరి శాతం 29కి చేరింది. 2016లో ఈ విషయంపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పందించారు.

గతంలో భారత సంప్రదాయాలు, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా  మారిటల్ రేప్ ను నేరపూరిత చర్యగా పరిగణించలేమన్నారు మేనకా గాంధీ. అయితే తాజాగా సరైన ఆధారాలు లభించిన పక్షంలో మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించే వీలుంటుందని, ఎక్కువ మంది బాధిత మహిళలు ఫిర్యాదులు చేయడం ద్వారానే ఇది వీలవుతుందన్నారు. మారిటల్ రేప్ ను క్రైమ్ గా పరిగణించేందుకు కొత్తచట్టాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

భారత శిక్షా స్మృతిలోని 375సి సెక్షన్ ప్రకారం మహిళ అంగీకారం లేకుండా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల బృందం ఆమెను బలవంతపెట్టడం అత్యాచారంగా పరిగణిస్తారు. అయితే భార్యలను హింసించే భర్తల విషయంలోనూ ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో పలువురు సభ్యులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన కేంద్రం.. మారిటల్ రేప్ ను నేరంగా పరిగణించబోమని చెప్పింది.

ఒకవైపు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు దీనిని నేరంగా పరిగణించలేమని చెబుతున్నప్పటికీ.. ఇది మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై చట్టం తీసుకురావాలని కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios