పెళ్లిలో ఫోటోలు తీసి.. పోర్న్ సైట్స్ లో పెట్టాడు

పెళ్లిలో ఫోటోలు తీసి.. పోర్న్ సైట్స్ లో పెట్టాడు

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైనది. అందుకే ఆ మధుర ఘట్టాన్ని ఫోటోల్లో, వీడియోల్లో చిత్రీకరిస్తుంటారు. కేవలం వధు వరుల ఫోటోలు మాత్రమే కాకుండా తమ వివాహానికి వచ్చిన వారి ఫోటోలను కూడా తీసుకొని భద్రపరుచుకుంటారు. కాగా.. ఈ అవకాశాన్ని ఓ  ఫోటోగ్రాఫర్ అత్యంత నీచమైన పనికి ఉపయోగించుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లికి వచ్చే వేలాది మంది మహిళల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని వివిధ పెళ్లిళ్లకు హాజరైన ఎంతో మంది మహిళల ఫొటోలను  మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశాడు.

 సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న తన మార్ఫింగ్‌ ఫొటోను ఓ మహిళ గుర్తించడంతో విషయం బయటపడింది .  దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదయమ్‌ షూట్‌ అండ్‌ ఎడిట్‌ స్టూడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే స్టూడియోని సీజ్ చేశారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని స్టూడియో యజమానులు సతీశన్‌, దినేశ్‌లను అరెస్ట్‌ చేశారు. కేసులో మరో ప్రధాన నిందితుడు బిబేశ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page