విశాఖలో శ్రీలంకజట్టుకు తప్పిన పెనుప్రమాదం

First Published 16, Dec 2017, 4:20 PM IST
Srilanka Cricketers Escaped Major Accident
Highlights
  • అదుపుతప్పిన బస్సు
  • అప్రమత్తమైన బస్సు డ్రైవర్

విశాఖపట్నంలో శ్రీలంక జట్టుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ నెల 17వ తేదీన విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్- శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండు రోజుల క్రితమే విశాఖ నగరానికి చేరుకున్నారు.

కాగా, శుక్రవారం ఆ జట్టు స్థానిక నోవాటెల్‌ హోటల్‌ నుంచి నెట్‌ప్రాక్టీస్ కోసం స్టేడియానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు హోటల్‌ సమీపంలో అదుపుతప్పి ఓ గోడను ఢీకొంది. దీంతో లంక క్రికెటర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు బస్సును సరైన దిశలో నడపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా స్టేడియంలో నెట్‌పాక్ట్రీసు చేసుకుని తిరిగి హోటల్‌కు చేరుకున్నారు.

ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు అధికారులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లు దాదాపుగా పూర్తిగా అమ్ముడయ్యాయి. మూడు వన్డేల సిరీస్ 1-1తో నిలిచిన వేళ కీలకమైన మూడో వన్డే కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

loader