వయాగ్రాతో ఆ సమస్యతోపాటు క్యాన్సర్ కి కూడా చెక్

First Published 24, Mar 2018, 5:01 PM IST
Small Dose Of Viagra Daily May Cut Colorectal Cancer Risk
Highlights
  • వయాగ్రా తో క్యాన్సర్ ని కూడా తగ్గించవచ్చంటున్న నిపుణులు

పురుషుల్లో అంగస్థంభన సమస్యకు పరిష్కారంగా చాలా మంది వయాగ్రా వినియోగిస్తూ ఉంటారు. అయితే..  వయాగ్రాతో కేవలం అంగ స్థంభన సమస్యతోపాటు.. ఒకరకమైన క్యాన్సర్ కి కూడా చెక్ పెట్టేయవచ్చు అంటున్నారు వైద్యులు. దీనిపై పలువురు నిపుణులు పరిశోధనలు కూడా చేశారు. వారి పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఆగస్టా యూనివర్శిటీలోని జార్జియా మెడికల్ కళాశాలకు చెందిన పలువురు దీనిపై సుదీర్ఘకాలం పాటు పరిశోధనలు జరిపారు. వయాగ్రాను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా.. ఈ వయాగ్రా కారణంగా ఇప్పటివరకు ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అంతేకాదు.. ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగా వయాగ్రా ను రెగ్యులర్ గా తీసుకుంటే.. పేగు సంబంధిత క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చని పరిశోధనలో తేలింది. వయాగ్రా లో ఉండే కెమికల్.. పేగు సంబంధిత క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుందట. దీంతో.. ఈ రకం క్యాన్సర్ కి చెక్ పెట్టేయవచ్చు అంటున్నారు నిపుణులు.

loader