ఈమె మోడల్ కాదు.. గ్రామ సర్పంచి

ఈమె మోడల్ కాదు.. గ్రామ సర్పంచి

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూసి.. ఎవరో మోడల్ లేదా సినిమా నటో అనుకునేరు. నిజానికి ఆమె ఓ గ్రామ సర్పంచి. నమ్మసక్యంగా లేదు కదా. కానీ నిజంగానే ఆమె ఓ గ్రామ సర్పంచి. ఎంబీబీఎస్ చదివి అందరూ డాక్టర్లు అయితే.. ఈమె మాత్రం సర్పంచి అయ్యింది. ఈ ఎంబీబీఎస్ సర్పంచి కథేంటో ఒకసారి తెలుసుకుందామా...

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా గ్రామ పంచాయతీ పరిధిలో ఆడపిల్లలను బడికే సరిగ్గా పంపించరు. అక్కడ డిగ్రీ, బీఈడీ చదివిన వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అదే గ్రమానికి చెందిన షహనాజ్ మాత్రం ఎంబీబీస్ చదువుతోంది. 24 సంవత్సరాల షహనాజ్ ఈ విద్యా సంవత్సరం గడిస్తే ఎంబీబీఎస్ పూర్తి చేయబోతున్నది. ఆ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలన్నది ఆమె ఆలోచన. కానీ.. ఉన్నట్టుండి పరిస్థితులు డాక్టర్ కావాల్సిన ఆమెను ఆ ఊరికి సర్పంచిని చేశాయి. అంతేకాదు.. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు కూడా ప్రకటించింది షహనాజ్.

దీనికంతటికీ కారణమేమంటే.. షహనాజ్ వాళ్ల తాతయ్య ఆ గ్రామానికి సర్పంచిగా ఉండేవారు. గతేడాది ఆయన ఎన్నిక చెల్లదని, స్థానిక కోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఆయన స్థానంలో సర్పంచిగా పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానాన్ని ఆయన వారసురాలిగా భర్తీ చేయాలనుకుంది షహనాజ్. అయితే.. రాజస్థాన్‌లో సర్పంచిగా పోటీ చేయాలంటే పదవ తరగతి పాసై ఉండాలి. ఈ అమ్మాయి ఏకంగా ఎంబీబీఎస్ చదువడం, తెలివితేటలు గల అమ్మాయిగా పేరుండడంతో ఆమె ఎన్నిక సులువుగా జరిగిపోయింది. అంతేకాదు.. గత 55 ఏళ్లుగా వీళ్ల తాతయ్యే ఆ ఊరి సర్పంచి. ఆమె తల్లి రాజస్థాన్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్ చదువుతూ.. అతి చిన్న వయసులో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన షహనాజ్ పేరు ప్రస్తుతం రాజస్థాన్‌లో మారుమోగుతున్నది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page