కోర్టు షాకింగ్ తీర్పు.. అలా చేస్తే రేప్ కాదట

First Published 2, Apr 2018, 2:57 PM IST
Sexual relations due to deep love not rape, Bombay High Court says
Highlights
కోర్టు తీర్పు విని అందరూ షాకయ్యారు

అత్యాచార కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇద్దరు ప్రేమికులు పెళ్లికి ముందు శారీరకంగా కలవడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొంది. పూర్తి సమాచారంలోకి వెళితే...

గోవాకు చెందిన చెఫ్ యోగేష్ పాలేకర్ తన సహ ఉద్యోగిని అయిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యోగేష్ తన సహ ఉద్యోగిని అయిన మహిళను తన ఇంట్లో వారికి పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రేయసి ఆ రాత్రి ప్రియుడు యోగేష్ ఇంట్లోని బస చేసింది. దీంతో ప్రియుడు రాత్రివేళ ప్రియురాలిపై మూడు సార్లు లైంగిక చర్యలో పాల్గొన్నాడు. అనంతరం ఆమెను ఉదయాన్నే వారింట్లో వదిలేశాడు. అనంతరం తక్కువ కులం అమ్మాయి అని పెళ్లి నిరాకరించాడు.

 దీంతో ప్రేయసి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై యోగేష్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయగా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విదించింది. దీనిపై యోగేష్ హైకోర్టులో అప్పీలు చేయగా ప్రేయసితో యోగేష్ ప్రేమలో పడ్డాడని, ఆమెకు ఆర్థికంగా కూడా సాయం చేశాడని అందువల్ల పరస్పర ఆమోదంతో లైంగిక చర్యలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని కోర్టు తీర్పు చెప్పింది. యోగేష్ పై నమోదైన రేప్ కేసును కోర్టు కొట్టివేసింది. కాగా.. ఇప్పుడు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు.. చర్చనీయాంశంగా మారింది.

loader