చంద్రబాబు..గురివిందగింజ నీతి

Ridiculous statement by chandrababu on ycp mp vijaya sai
Highlights

‘ఆర్ధిక నేరస్ధులైన విజయ్ మాల్యా, విజయసాయిరెడ్డిల్లో ఒకరు దేశం వదిలిపరారు కాగా...మరొకరు ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఎలా ఉంటున్నారు’..ఇవి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.

‘ఆర్ధిక నేరస్ధులైన విజయ్ మాల్యా, విజయసాయిరెడ్డిల్లో ఒకరు దేశం వదిలిపరారు కాగా...మరొకరు ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఎలా ఉంటున్నారు’..ఇవి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. నిజానికి చంద్రబాబు విజయసాయిని లక్ష్యంగా చేసుకుని ఎప్పటి నుండో ఇవే ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలు, ఆరోపణలు చూస్తుంటే గురువిందగింజ నీతే గుర్తుకు వస్తోంది. ఎందుకంటే, ఆర్ధిక నేరగాళ్ళ జాబితా టిడిపిలో కూడా తక్కువేం లేదు మరి.

చంద్రబాబు ఆరోపణల ప్రకారం విజయసాయి ఆర్ధిక నేరగాడే అని అనుకుందాం. ఎంపి హోదాలో విజయసాయి ఎక్కడికైనా వెళ్ళ గలిగిన, ఎవరినైనా కలవగలిగిన స్వేచ్ఛ ఆయనకుంది. ఆ విషయం చంద్రబాబుకు తెలియనిదేమీ కాదు. కాకపోతే ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఏమీ అనలేక పదే పదే ఎంపి లక్ష్యంగా ఆరోపణలు చూస్తున్నారు.

అయితే, ఇక్కడే అసలు మతలబుంది. అదేమిటంటే, ఆర్ధిక నేరగాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయంలోకి వెళ్ళకూడదన్నదే నిజమైతే అటువంటి జాబితాలో ఒక్క విజయసాయే కాదు. చాలామందిపైన ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఎవరిదాకానో ఎందుకు? మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా పనిచేసిన టిడిపి ఎంపి సుజనా చౌదరి మాటేంటి?

మారిషస్ బ్యాంకును మోసం చేసిన కేసులో సుజనాపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది కదా? ఆ కేసింకా కోర్టులో విచారణలో ఉంది. అలాగే, నరసరావుపేట టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు పైన కూడా బ్యాంకులను మోసం చేసిన కేసుంది. ఇక, రాష్ట్రంలో అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపై బ్యాంకులను మోసం చేసిన కేసులు లేవా? అంత నీతులు చెబుతున్న చంద్రబాబు మరి, వీళ్ళందరికీ టిక్కెట్లు ఎలా ఇచ్చారు? మంత్రులను ఎలా చేశారో చెప్పాలి?

 

loader