ముంబై: క్యాస్టింగ్ కౌచ్ పై సరోజ్ ఖాన్ లేదా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా అన్నారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ లైంగిక కోరికలను తీర్చాలని అడిగేవారని, తీర్చేవారని ఆయన అన్నారు.

జీవితంలో ముందుకు సాగడానికి ఇది చాలా కాలం నుంచి అమలులో ఉందని అన్నారు. నన్ను సంతోషపెట్టు, నిన్ను సంతోషపెడుతా అనేది ఉందని అన్నారు. 

ఎవరికీ తెలియని కాలం నుంచే అది అమలులో ఉందని అన్నారు. దాని గురించి నిస్పృహ చెందాల్సిన అవసరం ఏముందని అన్నారు. రేఖ, మాధురి దీక్షిత్, శ్రీదేవి వంటివారికి కోరియోగ్రఫీ సేవలు అందించడంలో, వారి కెరీర్ ను తీర్చిదిద్దడంలో సరోజ్ ఖాన్ పాత్ర చాలా ఉందని అన్నారు. 

సరోజ్ ఖాన్ హృదయంతో మాట్లాడుతుందని, తరుచుగా ఆమె రాజకీయంగా కరెక్ట్ నెస్ నుంచి కాకుండా ఉద్వేగభరితమైన కరెక్ట్ నెస్ నుంచి మాట్లాడుతారని అన్నారు. 

లైంగిక సంబంధాల విషయంలో బాలీవుడ్ లో అమ్మాయిలు రాజీ పడాల్సి వస్తుందని అని ఆమె అన్నదంటే ఏం జరుగుతుందనేది ఆమెకు తెలిసి ఉంటుందని అన్నారు. 

క్యాస్టింగ్ కౌచ్ అనేది వాస్తవమని అంటూ తాను సరోజ్ ఖాన్, రేణుకా చౌదరిల వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని, సినిమాల్లో ముందుకు పోవాలంటే అమ్మాయిలు ఏ విధమైన రాజీలకు రావాలో తనకు తెలుసునని, బహుశా సరోజీ స్వయంగా అటువంటి వేదనను అనుభవించి ఉంటుందని అన్నారు. 

అది సరైంది తాను అనడం లేదని, ఆ విధమైన వ్యవహారాలకు తాను దూరంగానే ఉన్నానని, అయితే మన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు మనకు తెలుస్తూనే ఉంటాయని అన్నారు. 

సరోజ్ ఖాన్ వాస్తవం చెప్పడాన్ని తాను ఖండించడం లేదని, జీవితంలో ముందుకు సాగడానికి అమ్మాయిలు, అబ్బాయిలు రాజీ పడక తప్పదనే పరిస్థితిని కల్పించడాన్ని తాను ఖండిస్తున్నానని శతృఘ్న సిన్హా అన్నారు.

కౌచ్ విషయంలో ఏం జరుగుతోందనేది, ఇద్దరు వ్యక్తులు దగ్గర కావడం అనేది వారి వ్యక్తిగత విషయమని అన్నారు. కౌచ్ విషయంలో అమ్మాయి లేదా అబ్బాయి అబద్ధం చెప్పాలని ఎవరూ బలవంతం చేయడం లేదని అన్నారు. నువ్వు ఒకటి ఇవ్వాలనుకుంటున్నావు, దానికి ఎదుటివారికి ఇష్టమైంది ఇవ్వడానికి సిద్ధపడ్డావని, అటువంటి స్థితిలో అనివార్యం ఏముందని అన్నారు.