Asianet News TeluguAsianet News Telugu

డేరా బాబా రేప్ దోషి, ఉత్తర భారతంలో హింసాకాండ,28 మంది మృతి

  • దేశ మంతా వినాయక చవితి జరపుకుంటున్నరోజున ఉత్తర భారత ంలోని అనేక ప్రాంతాలలో హింసాకాండ చెలరేగింది.
  • 28 మంది దాకా చనిపోయారు, 200 మంది పైబడి గాయపడ్డట్లు సమాచారం
  • డేరా బాబాగా పేరున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్  రేప్ కేసులలో దోషి అని తీర్పు వెలువడటంతో హింసాకాండ  చెలరేగింది

 

ram rahim found guilty violence erupts 28 reportedly killed

ఇండియన్ రాక్ బాబాగా పేరున్న డేరా బాబా ఒక రేప్ కేసులో దోషి అని సిబిఐ కోర్టు తేల్చగానే పంజాబ్ హర్యానా తో పాటు ఢిలీలోల కూడా హింసాకాండ చెలరేగింది. డేరా బాబా పేరు గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఆయన సచ్ఛా సౌదా అనే మతవర్గాన్ని తయారుచేసుకున్నారు. ఆయన మీద రేప్ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులు తేలేందుకు పదిహేను సంవత్సరాలు పట్టింది. అనేక దేశాలలో తనకు ఆరు కోట్ల మంది దాకా అనుచరులున్నారని బాబా చెబుతుంటారు. ఛండీగడ్ సమీపంలోని పంచ్ కులా ఆయన స్థావరం.

ఆయన మీద వచ్చి ఆరోపణల మీద ఈ రోజు తీర్పువెలువడుతున్నందున, ఆయన అనుచరులు వందల సంఖ్యలో  కోర్టుకు చేరుకున్నారు. తీర్పు వెలువడగానే పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగుతుందని అంతా అనుమానించారు. భదత్రా బలగాలను కూడా మొహరించారు.

 

 

ఇంత ఏర్పాట్లు జరిగినా తీర్పుతో పరిస్థితి అదుపు తప్పింది.  రేప్ ఆరోపణలు రుజువయ్యాయి. ఛండీగడ్ కోర్టు అతగాడు దోషి అని తేల్చింది. శిక్షను సోమవారం ప్రకటిస్తారు. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలలో తలెత్తిన ఘర్షణల్లో 28 మంది మృతి చెందారు. 200 మంది గాయపడ్డారు. హర్యానాలోని పంచకులలో చిన్నారితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించగానే గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ మద్దతుదారులు హింస, విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. మీడియా వాహనాలు, ప్రతినిధులపైనా ప్రతాపం చూపించారు.  ఈ అల్లర్ల మధ్య బాబాను హెలికాప్టర్ రోథక్ కు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రామ్  రహీం కేంద్ర స్థావరం ఉన్న సీర్సాకు సైన్యాన్ని కూడా రప్పించారు. నష్టమయిన ఆస్తులకు పరిహారంగా బాబా ఆస్తులను స్వాదీనం చేసుకోవాలని కోర్టు పేర్కొంది.

హర్యానాలో రెండు రైల్వే స్టేషన్లు, పవర్‌గ్రిడ్‌, పెట్రోల్‌ పంప్‌నకు నిప్పుపెట్టారు. ఢిల్లీలోనూ నిరసనకారులు విధ్వంసాలకు దిగారు. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో రైలు, రెండు బస్సులను దగ్ధం చేశారు. రాజస్థాన్‌లో  నిరసనకారులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పంచకులతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అల్లర్లకు పాల్పడిన 1000 డేరా సచ్చా సౌదా కార్యకర్తలకు అదుపులోకి తీసుకున్నట్టు హర్యానా అదనపు డీజీపీ మహ్మద్‌ ఆకిల్‌ తెలిపారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాకు అదనపు భద్రతా దళాలను తరలించారు. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో పాటు పలు జిల్లాల్లో 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. దేశ రాజధాని ఢిల్లిలో రెండు బస్సులను, ఖాళీ గా ఉన్న రెండు బోగీలను కాల్చారు. ఢిల్లీలో బాగా ఉద్రిక్తత నెలకొంది. దేశరాజధాని ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. తమ రాష్ట్రానికి మరిన్ని బలగాలు పంపాలని కేంద్రాన్ని పంజాబ్‌ ప్రభుత్వం కోరినట్లు అధికారులు చెప్పారు.

 

ఇంత భారీగా విధ్వంసం జరగి విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్ట లేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని చెబుతున్నారు.రామ్ రహీం సింగ్ ను హెలికాప్టర్ లో ఒక వివిఐపి గెస్టు హౌస్ కు తరలించి వివిఐపి సత్కారం ఇస్తున్నారని విమర్శులు వస్తున్నాయి. ఆయనను జైలుకు తీసుకువెళ్లాలిగాని గెస్ట్ హౌస్కు తీసుకువెళ్లడమేమిటి?  ఇదే విధంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలయింది.

Follow Us:
Download App:
  • android
  • ios