న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా వాడనున్న ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్,  ఫోర్ వీలర్స్‌లో మూడు నుంచి నాలుగు వాట్ల సామర్థ్యం ఉంటేనే ఫేమ్ -2 పథకం కింద రాయితీలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రజా రవాణా వ్యవస్థ కింద వాడే విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫేమ్ - 2 కింద రూ.10 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఫేమ్ -2 పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఈ పథకం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది.

అమలు కాలంలో ఐదు లక్షల ఈ - రిక్షాలకు ఒక్కోదానికి రూ.50 వేల రాయితీ, ఫోర్ వీలర్స్ కు ఒక్కో దానికి రూ.1.5 లక్ష వరకు ఇన్సెంటివ్ కల్పిస్తుంది. 35 వేల ఫోర్ వీలర్ వెహికల్స్‌కు ఇది వర్తిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది ఫేమ్ 2 పథకం. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ‘ఫేమ్ -2’ పథకం అమలులోకి రానున్నదని భారీ పరిశ్రమలశాఖ నోటిపికేషన్ జారీ చేసింది. 

ప్రైవేట్ అవసరాల కోసం వాడే త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ వెహికల్స్‌కు ఈ రాయితీ వర్తించదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ రంగ రవాణా సంస్థల నుంచి అనుమతి వస్తేనే ఈ రాయితీలను కల్పిస్తూ వాహనాల విక్రయ డీలర్లు అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. వాణిజ్య వినియోగానికి వాడే ప్రజా రవాణా వ్యవస్థలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. టూ వీలర్ వెహికల్స్‌లో ప్రజా రవాణాకు వినియోగించే సంస్థలకు రాయితీలు లభిస్తాయి. అలాగే ప్రైవేట్ వ్యక్తులకు ఇన్సెంటివ్ లు వర్తిస్తాయి. 

దీని ప్రకారం టీ వీలర్ ధర రూ.1.5 లక్ష వరకు ఉంటే రాయితీ 20 వేల రూపాయల వరకు ఉంటుంది. అదే సమయంలో టూ వీలర్ వెహికల్స్ కొన్న వారికి ఒక్కసారి మాత్రమే ఇన్సెంటివ్ అమలు చేయాల్సిన బాధ్యత డీలర్లదే. వ్యక్తిగతంగా వినియోగించే వాహనాలు మినహా మిగతా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని ఫేమ్ 2 నోటిఫికేషన్ తెలిపింది. 

కన్వెన్షనల్ టెక్నాలజీతో అభివ్రుద్ది చేసిన బ్యాటరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే అధునాతన టెక్నాలజీ అభివ్రుద్ధి చేసిన బ్యాటరీలకు కూడా ఇన్సెంటివ్ లు లభిస్తాయి. అయితే అడ్వాన్స్ డ్ టెక్నాలజీ గల బ్యాటరీలతో కూడిన వాహనాలపై కేవలం రూ.10 వేల ఇన్సెంటివ్ మాత్రమే లభిస్తుంది. విద్యుత్ బస్సుల కొనుగోళ్లపై రూ.20 వేల రాయితీ ఇస్తారు.