Asianet News TeluguAsianet News Telugu

రష్ అవర్‌లో నో ప్రాబ్లం.. అదనపు చార్జీల సమస్యకు ఫ్రైడో క్యాబ్స్‌తో చెక్

రష్ అవర్‌లో నో ప్రాబ్లం.. అదనపు చార్జీల సమస్యకు ఫ్రైడో క్యాబ్స్‌తో చెక్

Pride Cab Services to be start from Sep 29
Author
Hyderabad, First Published Sep 27, 2019, 11:05 AM IST

హైదరాబాద్: రద్దీ వేళ్లలో అదనపు చార్జీ వసూలు చేయకుండా అద్దె కార్ల సేవలందిస్తామని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ ప్రణీత్‌ టెక్నాలజీస్ తెలిపింది. ప్రణీత్ గ్రూప్‌నకు చెందిన వెంకట ప్రణీత్‌ టెక్నాలజీస్‌ క్యాబ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది.

ముందుగా హైదరాబాద్‌లో సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు. ఇప్పటికే ప్రైడోలో 14,000 మందికి పైగా డ్రైవర్లు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 29న లాంఛనంగా ఫ్రైడో క్యాబ్ అగ్రిగేటర్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రయోగాత్మకంగా తమ సేవలను అందిస్తున్నామని చెప్పారు.

సొంత కారు కలిగిన డ్రైవర్లు పేర్లను నమోదు చేసుకోవాలని, కంపెనీ అసెట్‌ లైట్‌ విధానంలో కార్యకలాపాలను నిర్వహించనుందని ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నరేంద్ర కుమార్‌ తెలిపారు. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లో గురువారం నుంచి యాప్‌ అందుబాటులో ఉంటుంది.

వచ్చే ఆరు నెలల్లో ఢిల్లీ, బెంగళూరు నగరాలకు ప్రైడో సేవలను కంపెనీ విస్తరించనుంది. విస్తరణ కోసం వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్ యూవీ విభాగాల్లో క్యాబ్‌లను అందిస్తామని ప్రణీత్ టెక్నాలజీస్ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వ ‘హాక్-ఐ’తో ఫ్రైడో యాప్ సమ్మిళితం చేశామని ప్రణీత్ టెక్నాలజీ పేర్కొంది. అన్ని వ్యక్తిగత వివరాలను పరిశీలించిన తర్వాత డ్రైవర్ల పేర్లను నమోదు చేసుకున్నామని ప్రైడో వ్యవస్థాపకుడు నరేంద్ర కుమార్ కామరాజు చెప్పారు.

డ్రైవర్ల వద్ద నుంచి 10 శాతం లోపే కమిషన్ వసూలు చేస్తామని, వారికి మరింత ఆదాయం లభించేందుకు ఇది తోడ్పాటును అందిస్తుందని ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నరేంద్ర కుమార్‌ చెప్పారు. వారం, నెల ముందు కూడా క్యాబ్ లను బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక సందర్భాల్లో భారీగా క్యాబ్ లు బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఖాళీగా వచ్చే డ్రైవర్లకు నష్టం వాటిల్లకుండా రిటర్న్ కాంపన్సేషన్, ప్రయాణికులు దగ్గర్లో క్యాబ్ లు అందుబాటులో లేకపోతే దూరం నుంచైనా రప్పించుకోవడం వంటి వసతులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నరేంద్ర కుమార్‌ చెప్పారు.

మూడు నెలల్లో నగరంలో 10 లక్షల రైడ్స్‌‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నరేంద్ర కుమార్‌ తెలిపారు. డ్రైవర్లను హ్యాపీగా ఉంచితే రైడర్లు హ్యాపీగా ఉంటారనేదే తమ కంపెనీ సిద్ధాంతమని అన్నారు. దీనికి అనుగుణంగానే తమ బిజినెస్‌‌ మోడల్‌‌ రూపొందించినట్లు పేర్కొన్నారు.

బిల్లింగ్‌‌, ఇన్వాయిసింగ్‌‌లో ప్రైడో పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు ప్రైడో వ్యవస్థాపక డైరెక్టర్ నరేంద్ర కుమార్‌ చెప్పారు. గత 12 ఏళ్లలో హైదరాబాద్‌‌లో 22 ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రణీత్‌‌ గ్రూప్‌‌ టర్నోవర్‌‌ రూ. 300 కోట్లకు చేరిందని నరేంద్ర కుమార్‌‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios